Welcome To The Jungle Day 11 Box Office: 150 కోట్లకు చేరువగా వెల్‌కమ్ టు జంగిల్.. అక్షయ్ మూవీకి ఎన్ని కోట్లంటే
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, రవీనా టాండన్, లారా దత్తా, దిశా పటానీ, జాక్వలైన్ ఫెర్నాండేజ్, ఊర్వశి రౌటేలా, అర్షద్ వార్సీ, జాకీ ష్రాఫ్, పరేశ్ రావెల్‌తో సుమారుగా 30పైగా యాక్టర్లు, కమెడియన్లతో భారీగా నిర్మించిన చిత్రం వెల్‌కమ్ టూ ది జంగిల్. ఈ సినిమాను ఫిరోజ్ ఏ నాడియావాలా, రాకేష్ దాంగ్, వేదాంత్ వికాస్ బాలీ నిర్మించారు. ఈ సినిమాకు ప్రముఖ కోరియోగ్రాఫర్ ఆహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు షైరా ఆహ్మద్ ఖాన్ సహ నిర్మాతగా వ్యవహరించారు.
ఈ మూవీకి సాజిద్ వాజిద్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి స్వర్గీయ నీరజ్ ఓరా కథను అందించారు. ఇక సినిమాటోగ్రఫి: కబీర్ లాల్, ఎడిటర్: నితిన్ ఎఫ్‌సీపీ, మ్యూజిక్ కంపోజర్స్: విక్రమ్ మాంత్రోసే, తల్విందర్, ఎన్‌డీఎస్, ఆనంద్ రాజ్ ఆనంద్, కొరియోగ్రఫి: గణేష్ ఆచార్య, ఆదిల్ షేక్, ప్రిన్స్ గుప్తా, రాహుల్ శెట్టి, యాక్షన్ డైరెక్టర్: అబ్బాస్ ఆలీ మొఘల్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ చిత్రం జూన్ 26వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఈ మూవీకి వస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

వెల్‌కమ్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన ఈ సినిమా ఖర్చుకు వెనుకాడకుండా నిర్వహించారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 300 కోట్ల రూపాయల మేర అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమా టీజర్, కాస్టింగ్ వ్యవహారాల క్రేజీగా మారడంతో నాన్ థియేట్రికల్ బిజినెస్ అంటే ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ తదితర బిజినెస్ ద్వారా సుమారుగా 120 కోట్ల రూపాయలు రికవరీ అయ్యాయి. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సుమారుగా 200 కోట్ల రూపాయలుగా ట్రేడ్ వర్గాలు లెక్క కట్టాయి.
సినిమా నేపథ్యంతో సాగే కథతో అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం తొలివారం భారీ వసూళ్లను సాదించింది. ఈ చిత్రం ప్రీమియర్ల ద్వారా 4 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. ఇక తొలి రోజు 15.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 21 కోట్ల రూపాయలు, మూడో రోజు 25.5 కోట్ల రూపాయలు వసూలు చేసి.. తొలి మూడు రోజుల్లో ఈ చిత్రం 55 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద కొల్లగొట్టింది. అదే జోష్‌తో 4వ రోజు తొలి సోమవారం 8.5 కోట్ల రూపాయలు, ఐదో రోజు 9.5 కోట్ల రూపాయలు, ఆరో రోజు 6 కోట్ల రూపాయలు, ఏడో రోజు 5.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలి వారం సుమారుగా 85 కోట్ల రూపాయలు రాబట్టింది.
ఇక రెండో వారంలో కూడా వెల్‌కమ్ టూ ది జంగిల్ చిత్రం స్ట్రాంగ్‌గా నిలకడగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రం 8వ రోజు 5 కోట్ల రూపాయలు, 9వ రోజు 8 కోట్ల రూపాయలు, 10వ రోజు 10.5 కోట్లు, 11వ రోజు 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం రెండో వారంలో మూడు రోజుల్లో 27.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమా ఓవర్సీస్‌లో 2.7 మిలియన్లు అంటే.. ఇండియన్ కరెన్సీలో 26 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం గత 8 రోజుల్లో 138.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.
ఇక ఈ చిత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించడానికి భారీగానే వసూళ్లను సాధించాల్సి ఉంది. కానీ 2026 సంవత్సరంలో అత్యధికంగా కలెక్షన్లను రాబట్టిన బాలీవుడ్ చిత్రాల్లో 6వ చిత్రంగా ఈ సినిమా చేరింది. అంతే కాకుండా వరుస వైఫల్యాలతో కొనసాగుతున్న అక్షయ్ కుమార్ కెరీర్‌లో ఈ సినిమా మరో సక్సెస్‌ను చేర్చింది.


Click it and Unblock the Notifications