Welcome To The Jungle Day 3 Box Office: 100 కోట్లకు చేరువగా వెల్‌కమ్ టు ది జంగిల్.. అక్షయ్ మూవీకి ఎన్ని కోట్లు
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, రవీనా టాండన్, లారా దత్తా, దిశా పటానీ, జాక్వలైన్ ఫెర్నాండేజ్, ఊర్వశి రౌటేలా, అర్షద్ వార్సీ, జాకీ ష్రాఫ్, పరేశ్ రావెల్‌తో సుమారుగా 30పైగా యాక్టర్లు, కమెడియన్లతో భారీగా నిర్మించిన చిత్రం వెల్‌కమ్ టూ ది జంగిల్. ఈ సినిమాను ఫిరోజ్ ఏ నాడియావాలా, రాకేష్ దాంగ్, వేదాంత్ వికాస్ బాలీ నిర్మించారు. ఈ సినిమాకు ప్రముఖ కోరియోగ్రాఫర్ ఆహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు షైరా ఆహ్మద్ ఖాన్ సహ నిర్మాతగా వ్యవహరించారు.
ఈ మూవీకి సాజిద్ వాజిద్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి స్వర్గీయ నీరజ్ ఓరా కథను అందించారు. ఇక సినిమాటోగ్రఫి: కబీర్ లాల్, ఎడిటర్: నితిన్ ఎఫ్‌సీపీ, మ్యూజిక్ కంపోజర్స్: విక్రమ్ మాంత్రోసే, తల్విందర్, ఎన్‌డీఎస్, ఆనంద్ రాజ్ ఆనంద్, కొరియోగ్రఫి: గణేష్ ఆచార్య, ఆదిల్ షేక్, ప్రిన్స్ గుప్తా, రాహుల్ శెట్టి, యాక్షన్ డైరెక్టర్: అబ్బాస్ ఆలీ మొఘల్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ చిత్రం జూన్ 26వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఈ మూవీకి వస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

వెల్‌కమ్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన ఈ సినిమా ఖర్చుకు వెనుకాడకుండా నిర్వహించారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 300 కోట్ల రూపాయల మేర అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమా టీజర్, కాస్టింగ్ వ్యవహారాల క్రేజీగా మారడంతో నాన్ థియేట్రికల్ బిజినెస్ అంటే ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ తదితర బిజినెస్ ద్వారా సుమారుగా 120 కోట్ల రూపాయలు రికవరీ అయ్యాయి. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సుమారుగా 200 కోట్ల రూపాయలుగా ట్రేడ్ వర్గాలు లెక్క కట్టాయి.
వెల్‌కమ్ టూ ది జంగిల్ మూవీ సినిమాను రిలీజ్ డేట్ కంటే ఒకరోజు ముందు ప్రీమియర్లను ప్రదర్శించారు. ప్రీమియర్ల ద్వారా ఈ సినిమా 4.15 కోట్ల నెట్, 4.9 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక తొలి రోజు ఈ చిత్రం దేశవ్యాప్తంగా 15.45 కోట్ల నెట్, 18.5 కోట్ల గ్రాస్, రెండో రోజు 21.5 కోట్ల నెట్, 25.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా ఇండియాలో గత రెండు రోజుల్లో 50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
బాలీవుడ్‌కు చెందిన టాప్ యాక్టర్లలో దాదాపు 34 మందికిపైగా నటించిన ఈ సినిమాకు ఓవర్సీస్‌లో అంతగా స్పందన కనిపించలేదు. ఈ చిత్రం గత రెండు రోజుల్లో 500K డాలర్లను అంటే సుమారుగా ఈ చిత్రం 5.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్ 50.5 కోట్ల రూపాయలను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఈ చిత్రం మూడో రోజు ఆదివారం సెలవు దినం కావడంతో భారీ స్పందన కనిపిస్తున్నది. ఈ చిత్రం తాజా సమాచారం ప్రకారం.. ఆన్ లైన్ టికెటింగ్ కౌంటర్ల నుంచి అందిన సమాచారం ప్రకారం.. 10 కోట్ల రూపాయల నెట్, 12 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని తెలిపాయి. అయితే ఈ చిత్రం మూడో రోజు 27 నుంచి 30 కోట్ల రూపాయల మధ్య వసూళ్లను రాబట్ట వచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ చిత్రం 80 కోట్లకు అటు ఇటుగా వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా త్వరలోనే 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications