twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అజిత్ ‘గేంబ్లర్’చిత్రం రిజల్ట్ ఏంటి

    By Srikanya
    |

    అజిత్, త్రిష కాంబినేషన్ లో తమిళంలో రూపొందిన మంగత్తా చిత్రం డబ్బింగ్ వెర్షన్ 'గేంబ్లర్" ఈ రోజు విడుదలైంది. అయితే చాలా అంచనాలతో విడుదలైన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద నిలబడేటట్లు లేదని టాక్ తెచ్చుకుంది. తమిళంలో తమ అభిమాన హీరోని చూడటానికి ఎగబడినట్లుగా ఇక్కడ అజిత్ ని చూడ్డానికి ఎవరూ వెళ్లటం లేదని తెలుస్తోంది. అలాగే కథ అనేది లేకుండా కేవలం స్టైలిష్ టేకింగ్,అజిత్ ని రకరకాలుగా చూపటం పైనే దృష్టి పెట్టిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు నిరాశనే మిగులుస్తోంది. ఈ చిత్రంలో అజిత్ ..సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. అర్జున్ మరో పోలీస్ ఆపీసర్ గా ..అజిత్ ని పట్టుకోవటానికి తిరుగుతూంటాడు. ఇక సినిమా బాగుంటే ఏ భాష,ఏ హీరో అనేది లేకుండా హిట్జు చేసే తెలుగు జనం గ్లాబ్లర్ విషయంలో నో చెప్పేస్తున్నట్లు అంతటా టాక్ వినపడుతోంది.కందిరీగ,కాంచన చిత్రాలతో హిట్లతో జోరు మీదున్న బెల్లంకొండ ఈ సినిమాతో బోర్లాపడ్డాడంటున్నారు. అలాగే త్రిష కూడా తన వయస్సుని దాచి పెట్టలేకపోయిందని,ఆమె గ్లామర్ ఫేడవుట్ అయినట్లు చెప్తున్నారు. ఇక పూర్తిగా అజిత్ గెటప్ ని ఓషన్స్ లెవన్ లోని జూర్జ్ క్లూని ని అనుకరించారని చెప్పుకుంటున్నారు. అలాగే ఇటాలియన్ జాబ్ తరహాలో సాగ్ ఈ చిత్రం గతంలో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ చిత్రాన్ని గుర్తు చేస్తోందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. భిళ్లా తర్వాత సరైన హిట్ సంపాదించుకోలేని అజిత్ ఈ చిత్రంతో తమిళంలో మంచి విజయం సాధించారు.కానీ తెలుగులో మాత్రం ఫ్లాప్ నే ఇచ్చారు. అయితే సినిమాటోగ్రఫి, అజిత్ ఫెరఫార్మెన్స్, టెక్నికల్ విలువలు మాత్రం సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని, వాటిని చూడాలనుకునేవారు సినిమాకి వెళ్ళటం బెస్ట్ అని అంటున్నారు.

    English summary
    Ajith’s big film 'Gambler'relesed to day with negitive talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X