ఎక్కువే కానీ... : 'బాహుబలి' శాటిలైట్ రైట్స్ రేటు

By Srikanya

హైదరాబాద్:ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాహుబలి'. అనుష్క, తమన్నా హీరోయిన్స్. రానా కీలక పాత్రధారి. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దాదాపుగా పూర్తికావొచ్చింది. మే 15న ఈచిత్రాన్ని విడుదల చేస్తున్నామని రాజమౌళి అధికారికంగా తెలియజేశాడు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ గురించి అన్ని చోట్లా చర్చ మొదలైంది. ఈ రైట్స్ ఎంతకు వెళ్తాయి...ఎవరు తీసుకోనున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.

అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ను రెండు పార్ట్ లు కలిపి 25 కోట్లకు రేట్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. జెమినీ, మా టీవి, జీ తెలుగు ఈ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ రైట్స్ ఎవరికి వారే దక్కించుకోవాలనే ఆలోచనతో ఈ నిర్మాతలను కలుస్తున్నట్లు సమాచారం. అయితే 25 కోట్లు వెచ్చిస్తే ఆదాయం ఆ స్ధాయిలో ఉంటుందా అనేదే వారి సందేహం.

ఎందుకంటే అప్పటికే ఆల్రెడీ పెద్ద తెరపై ఈ సినిమాని అందరూ చూసేస్తారు కదా...రాజమౌళి వంటి దర్సకుడు తీస్తున్న సినిమాని,టీవిల్లో వచ్చేదాకా ఎవరు ఆగుతారు అని అంటున్నారట. అయితే బాహుబలి ..టీవిలో వేస్తుంటే తమ ఛానెల్ కు వచ్చే పాపులారిటీని వేరు కాబట్టి బేరమాడో మరొకటి చేసే ఈ రైట్స్ దక్కించుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

What about Baahubali Satellite Rights

మగధీరతో తెలుగు చలన చిత్ర చరిత్రను తిరగరాసిన ఈ రాజమౌళి ..ఇప్పుడు రాజుల కాలంనాటి కథను ఎంచుకున్నాడు. ప్రభాస్ హీరోగా, అనుష్క షెట్టి హీరోయిన్ గా గత రెండు సంవత్సరాలుగా రూపొందుతున్న చిత్రం బాహుబలి. రాజుల కాలం నాటి కథ కావటంతో తీవ్రంగా శ్రమించి రూపొందించారు.

ప్రభాస్, రాణా, అనుష్కల పుట్టినరోజుల సందర్భంగా ఒక్కో ట్రైలర్ విడుదల చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉండేలా, ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా చూసుకున్నాడు రాజమౌళి. బాహుబలి విడుదలకి సంబంధించి రోజుకో వార్త మీడియాలో హల్ చల్ దరిమిళ ఈ ఊహాగానాలకు తెరదించుతూ దర్శక ధీరుడు రాజమౌళి ఒక వీడియో మెస్సేజ్ ను సోషల్ మీడియాలో విడుదల చేశాడు.

బాహుబలికి సంబంధించిన ఒక్క పాట మాత్రమే మిగిలి ఉందని ఎట్టకేలకు షూటింగ్ మరియూ టాకీ పార్టు పూర్తి చేశామని రాజమౌళి సోషల్ మీడియాలో వెల్లడించాడు. గత రెండు సంవత్సరాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్, రాణా, అనుష్క, తమన్న , నాజర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, మళయాళీ, హిందీ భాషల్లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

బాహుబలి రెండు బాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అయితే బాహుబలి పార్ట్ 2 విడుదల ఎప్పుడనేది మాత్రం రాజమౌళి చెప్పలేదు. అయితే తొలి బాగానికి రెండవ బాగానికి గ్యాప్ తక్కువగా ఉండాలని, గ్యాప్ ఎక్కువగా ఉంటే కథలోని ఫీల్ మిస్సవుతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.

'బాహుబలి 2' ఈ ఏడాది చివర్లో వచ్చే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. పాటల్ని ఏప్రిల్‌ ద్వితీయార్ధంలో విడుదల చేస్తారని తెలుస్తోంది.

బాహుబలి, శివుడు.. ఇలా ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'బాహుబలి'. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాహుబలి సరసన అనుష్క నటిస్తుంటే, శివుడుకి జోడీగా తమన్నా కనిపించబోతోంది.

మనిషి తలచుకుంటే సాధించలేనిది లేదు. అయితే ఆ తలపు అత్యాశతో కూడినదైతే ఆ మనిషికి రేపు అనేది ఉండదు. ఈ అంశంతో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. గతంలో రాజుల నేపథ్యంలోనూ ఇలాంటి కథలు తీశారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఇలాంటి అంశంతోనే 'బాహుబలి'ని రూపొందిస్తున్నారు.

ఈ చిత్రానికి సంభందించిన లేటెస్ట్ ఇన్ఫోని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే... వాట్స్ అప్ యాప్ లో దొరుకుతుందని చెప్తున్నారు. ఈ మేరకు 809675522 నెంబర్ ని విడుదల చేసారు. ఈ నెంబర్ ని మీరు వాట్సప్ లో యాడ్ చేసుకుంటే మీరు ఎప్పటికప్పుడు చిత్రం గురించి ఎక్లూజివ్ ఇన్ఫర్మేషన్ పొందవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X