అల్లు అర్జున్ బద్రీనాధ్ తెలుగు ప్లాఫ్ సరే .. మళయాళం పరిస్ధితి ఏంటి
అల్లు అర్జున్, తమన్నా జంటగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన 'బద్రినాథ్' చిత్రం ఈ నెల 10న విడుదల అయి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నసంగతి తెలిసిందే. అయితే ఇదే సమయంలో ఈ చిత్రం కేరళలలో వంద ధియోటర్స్ లలో విడుదల అయింది. అయితే అక్కడ మాత్రం మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుని తెలుగు ప్లాఫ్ ఎఫెక్టు అక్కడ పడకుండా సేఫ్ గా బయిటపడిందని సమాచారం.
మొదటి మూడురోజుల్లోనే అరవై ఏడు లక్షలు దాకా వసూలు చేసినట్లు తెలుస్తోంది. నిజానికి అక్కడ ఏ తెలుగు హీరోకు మార్కెట్ లేదు. కానీ అల్లు అర్జున్ కి ఆర్య టైమ్ నుంచి మంచి మార్కెట్ ఉంటూ వస్తోంది. మళయాళ సూపర్ స్టార్స్ ముమ్మట్టి, మోహన్ లాల్ సినిమాలకు ధీటుగా బద్రీనాధ్ కి ఓపినింగ్స్ రావటం అక్కడ ట్రేడ్ పండితులను కలవలపరిచింది. దాంతో ఇక్కడ నెగిటివ్ టాక్ మూటగట్టుకున్నా అల్లు అర్జున్ అక్కడ రిపోర్టు విని కాస్త రిలీఫ్ ఫీలయ్యాడని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications