'మసాలా' కలెక్షన్స్ పరిస్ధితి ఏంటి?
హైదరాబాద్ : విజయభాస్కర్.కె దర్శకత్వంలో తెరకెక్కి మొన్న గురువారం విడుదలైన చిత్రం 'మసాలా' . ఎన్నో వాయిదాలు అనంతరం విడుదలైన ఈ చిత్రం హిందీలో విజయవంతమైన 'బోల్ బచ్చన్' ఆధారంగా రూపొందింది. వెంకటేష్,రామ్ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం రిలీజ్ రోజు మార్నింగ్ షో కే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. మాట్ని నుంచి చాలా చోట్ల కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయ్యాయని ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే శని,ఆదివారాలను కలెక్షన్స్ ఫరవాలేదనిపించుకుంది. కానీ సోమవారం నుంచి అంటే ఈ రోజు నుంచి కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయన్న దానిపై చిత్రం భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. అయితే నిర్మాతలు ఈ చిత్రాన్ని మంచి రేట్ కే అమ్ముకున్నారని, ఎగ్జిబిటర్స్,డిస్ట్రిబ్యూటర్స్ కే ఆ నష్టం అని తేలుస్తున్నారు.
సినిమా స్టేజి షోలాగ ఉందని కొందరంటూంటే లేదు...అది టీవి ల్లో వచ్చే జబర్ధస్త్ పోగ్రాం లా జోకులు కూర్చినట్లు ఉందని మరికొంతమంది బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఒరిజనల్ బోల్ బచ్చన్ కథని ఉన్నదున్నట్లు షాట్ బై షాట్ తీసుకుంటూ పోయారని, చివరకు కాస్ట్యూమ్స్ విషయం కూడా మార్పు తేలేదని అందుకే పూర్తిగా నేటివిటీకి దూరమైందని చెప్తున్నారు. వెంకటేష్ పఠానులు వేసుకునే డ్రస్ వేసుకుని, సినిమాలో అరుస్తూ రామ్ ని డామ్ నేట్ చేసే ప్రయత్నం చేసాడని, దాంతో రామ్ ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కన్నా తక్కువగా కనపడ్డాడని అంటున్నారు.
అలాగే ఒరిజనల్ కథలోనే ఎన్నో ఇబ్బందులు ఉన్నా దాన్ని మార్చకుండా తెరకెక్కించటం విజయ్ భాస్కర్ చేసిన పొరపాటు అని తేలుస్తున్నారు. గ్లామర్ విషయంలోనూ అంజలి, షాజన్ పదమ్‌సీ హీరోయిన్స్ సినిమాకు ఏ విధంగానూ ఉపయోగపడలేదు. రామ్ వరస ప్లాప్ లలో ఉండటం, వెంకటేష్ ది అదే పరిస్ధితి కావటంతో ఓపినింగ్స్ సైతం తెచ్చుకోలేకపోయింది.
డి.సురేష్‌బాబు, స్రవంతి రవికిషోర్ నిర్మాణ విలువలు బాగానే ఉన్నా...ఫలితం లేకుండా పోయిందని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే...మ్యూజిక్ థమన్ కూడా తీవ్రంగా నిరాసపరిచారు. సినిమాలో కంపల్సరీగా మారిన బ్రహ్మానందం లేకపోవటం కూడా ఈ కామెడీ సినిమాలో ఓ లోటే అంటున్నారు. అలీ, జయప్రకాష్‌రెడ్డి, ఎమ్.ఎస్.నారాయణ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆండ్రూ, సంగీతం: తమన్.


Click it and Unblock the Notifications












