twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఓహ్ మై ప్రెండ్'కలెక్షన్స్ పొజీషన్ ?

    By Srikanya
    |

    దిల్ రాజు తాజా చిత్రం ఓహ్ మై ప్రెండ్ మొన్న శుక్రవారం విడుదలైంది.ఈ చిత్రం మార్నింగ్ షో కే డివైడ్ టాక్ తెచ్చుకుంది.అయితే శుక్ర,శని,ఆది వారాలు మాత్రం కలెక్షన్స్ బాగానే వసూలు చేసినట్లు సమాచారం.సిద్దార్దకు మార్కెట్ లేకపోయినా ఓపినింగ్స్ మాత్రం ఘనంగానే వచ్చాయి.అయితే సోమవారం నుంచి చాలా సెంటర్లలో కలెక్షన్స్ తగ్గుటున్నట్లు ట్రేడ్ లో వినిపిస్తోంది.ముఖ్యంగా బి,సి సెంటర్లలో ఈ సినిమా కు పెద్దగా కలెక్షన్స్ రావటం లేదు.ఎ సెంటర్లు,మల్టి ప్లెక్స్ లలో మాత్రమే హౌస్ ఫుల్స్ లో నడుస్తోంది.స్నేహం,ప్రేమ అంశాలు చుట్టూ తిరిగే ఈ కథలో శ్రుతిహాసన్,సిద్దార్ధ,హన్సిక నటించారు.వేణు శ్రీరామ్ అనే దర్శకుడు ఈ చిత్రంతో పరిచయం అయ్యాడు.

    అలాగే దిల్ రాజు కూడా ఈ వారం నుంచి కొత్త తరహా పబ్లిసిటీతో ఈ చిత్రాన్ని ప్రమోట్ చెయ్యటానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక వారు ఊహించినట్లుగా రాహుల్ రాజ్ మ్యూజిక్ పెద్దగా వర్కవుట్ కాకపోవటం కూడా సినిమాకు మైనస్ గా మారింది.సినిమా మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ లో జరిగే కథ కావటంతో సంగీతంపై బాగా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు.అయితే చైతన్య కాలేజి పాట తప్ప మిగతా వేమీ యూత్ లోకి వెళ్లలేదు.మరో ప్రక్క ఈ చిత్రానికి పోటీ ఇచ్చే చిత్రం లేకపోవటం కూడా సినిమాకి కొంతలో కొంత ప్లస్ అయ్యింది.ఈ సినిమాతో పాటే విడుదలైన ఇట్స్ మై లవ్ స్టోరీ ప్లాప్ టాక్ తెచ్చుకోవటం కూడా సినిమాకు బాగా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది.ఎందుకంటే ఆ సినిమా వర్కవుట్ అయ్యితే గ్యారెంటీగా యూత్ కి మరో ఆప్షన్ ఉండేది.కానీ ఇప్పుడు వారికి ఓహ్ మై ప్రెండ్ చిత్రం ఒక్కటే కనిపిస్తోంది.కామిడీ మరికాస్త ఉంటే సినిమా నిలబడేది అంటున్నారు.ఏదైమైనా ఈ వారాంతానికి కానీ పూర్తిగా ఈ చిత్రం రిజల్ట్ తెలియదు.

    English summary
    Trade sources suspecting a positive mouth talk in youth circles will definitely help Oh My friend film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X