పవన్ 'తీన్ మార్' కలెక్షన్స్ మరీ అంత ఘోరంగా ఉన్నాయా?
పవన్ కళ్యాణ్, త్రిష కాంబినేషన్ లో రూపొందిన తీన్ మార్ చిత్రం కలెక్షన్స్ రోజు రోజుకీ డ్రాప్ అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అన్ని చోట్ల నుంచీ పాజిటివ్ టాక్, రివ్యూలు వచ్చినా ఈ చిత్రం కేవలం మల్టిఫ్లెక్స్ కే పరమితమయ్యిందని ట్రేడ్ లో వినపడుతోంది. రిలీజ్ రోజు విపరీతమైన ఓపినింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రం ఐదో రోజు కి చేరుకునేసరికి పూర్తి స్దాయి డ్రాప్ అయిపోయింది. బి, సి సెంటర్లలలో అయితే అస్సుల పవన్ కళ్యాణ్ చిత్రంలా కలెక్షన్స్ లేవని అంటున్నారు. ఇక సిటీలలో, ఓవర్ సీస్ లలో తెచ్చిన ఓపినింగ్స్, తొలి రోజు కలెక్షన్స్ కొంత వరకూ ఊరటనిచ్చాయని చెప్తున్నారు. అయితే ఎ సెంటర్లలో కూడా లవ్ ఆజ్ కల్ చూసిన వారు ఈ చిత్రాన్ని చూడటానకి ఆసక్తి చూపెట్టకపోవటం కొంత మైనస్ గా మారింది. స్పాట్ డబ్బింగ్,స్లో పేసెడ్ స్క్రీన్ ప్లే, అర్జున్ పాల్వాయ్ క్యారెక్టర్ సినిమాకు మేజర్ డ్రా బ్యాక్ గా చెప్తున్నారు. వీటికి తోడు పైరసీ ఈ సినిమాకు పెద్ద సమస్యగా మారింది. డివిడి క్వాలిటీ ప్రింట్లు మార్కెట్లో మొదటిరోజే దొరకటం ఈ సినిమాకు ప్రేక్షకుడని దూరం చేసాయి. అయితే శక్తి అంతలా కలెక్షన్స్ పడిపోకపోవటమే పాజిటివ్ అంశం అంటున్నారు. అయితే మిస్టర్ ఫెరఫెక్ట్ టాక్ పై ఈ చిత్రం నెక్స్ట్ వీక్ ఆదారపడి ఉంటుంది.


Click it and Unblock the Notifications











