1000 కోట్ల ఆస్తికి వారసురాలు, కానీ భర్త మాత్రం జిమ్ ట్రైనర్.. ఆ స్టార్ హీరో కూతురు ఎవరో తెలుసా?
కొన్నిసార్లు ఎంత డబ్బు ఉన్నా మనసుకు దగ్గరైన మనిషి ఉంటే బాగుండు అనిపిస్తుంది. మనిషి ఇచ్చే ప్రేమను డబ్బు ఇవ్వలేదు అనే విషయం చాలా మందికి తెలుసు. అందుకే ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఓ స్టార్ హీరో 1000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నప్పటికీ తన కూతురుని డిప్రెషన్ నుంచి బయటపడేయ లేకపోయాడు. తన ఆస్తి అంతస్తు చేయలేని ఆ పనిని ఓ జిమ్ ట్రైనర్ చేయడంతో అతన్నే అల్లుడుగా తెచ్చుకున్నాడు. సినిమా స్టోరీళా ఉన్న ఈ కథ ఏ స్టార్ హీరోది ? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.
ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నది బాలీవుడ్ ఖాన్ల త్రయంలో ఒకరైన అమీర్ ఖాన్ గురించే. ఆయనకు 1000 కోట్లకు పైగా ఆస్తి ఉంది. అయితే కూతురిని డిప్రెషన్ నుంచి కాపాడింది జిమ్ ట్రైనర్ నుపుర్ శిఖరే. ఈ ఏడాది జనవరి 10న అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ తన ప్రియుడు నుపుర్ శిఖరేను 'ఉదయ్‌పూర్ లేక్ ప్యాలెస్'లో వివాహం చేసుకుంది.

నూపుర్ శిఖరే జిమ్ షార్ట్స్‌లో జాగింగ్ చేసి పెళ్లి ఊరేగింపుతో హోటల్‌కు చేరుకున్నారు. ఇద్దరూ కల్యాణ తంతు నిర్వహించారు. పెళ్లికి, ప్రేమకు ముందు ఇరా ఖాన్ తీవ్ర మనోవేదనకు గురైంది. ఇరా ఖాన్ దాదాపు 3 సంవత్సరాలు డిప్రెషన్‌తో బాధపడింది. ప్రియుడు నుపుర్ తన లైఫ్ లోకి వచ్చాకే ఆమె డిప్రెషన్ తగ్గింది.
ఈ విషయాన్ని స్వయంగా ఇరా ఖాన్ చాలాసార్లు ప్రస్తావించింది. చాలా ఇంటర్వ్యూలలో తన డిప్రెషన్ గురించి మాట్లాడింది. ఆ తర్వాత కూడా ఇరా ఖాన్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. ఇరా ఖాన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో 6 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. కరోనా మహమ్మారి తర్వాత ఇరా ఖాన్ జీవితంలో చాలా మార్పులు వచ్చాయి.

కరోనా మహమ్మారి సమయంలో ఇరా ఖాన్ తన తండ్రి జిమ్ ట్రైనర్ నుపుర్ శిఖరే నుండి జిమ్ శిక్షణ తీసుకోవడం మొదలు పెట్టింది. అయితే అప్పటికే డిప్రెషన్ లో ఉన్న ఆమెకు నుపుర్ అండగా నిలిచాడు. వారిద్దరూ అలా స్నేహితులయ్యారు. అతి తక్కువ సమయంలోనే వీరి స్నేహం ప్రేమగా మారింది. ప్రేమలో పడ్డాక ఇద్దరూ కలిసి చాలా సమయం గడపడం ప్రారంభించారు.
చాలా కాలం పాటు సహజీవనం చేసిన నూపుర్ శిఖరే 2023లో ఇరా ఖాన్‌కు ప్రపోజ్ చేశాడు. ఇరా ఖాన్ కూడా ఓకే చెప్పింది. ఆ ఫోటోను ఇరా ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇరా ఖాన్ మానసిక సమస్యల గురించి నుపుర్ కు బాగా తెలుసు. అందుకే ఆమెను మరింత కేరింగ్ గా చూసుకుంటున్నాడు.
ఇరా ఖాన్ తండ్రి అమీర్ ఖాన్ కూడా డిప్రెషన్‌లో ఉన్నారు. అమీర్ ఖాన్ తన డిప్రెషన్‌ను ఎదుర్కోవడానికి తన కుటుంబ సభ్యుల సహాయం కూడా తీసుకున్నాడు. ఇప్పుడు తండ్రి కూతుర్ల ఆరోగ్యం పూర్తిగా బాగుంది. ఇరా ఖాన్ ప్రేమలో పడగానే తన డిప్రెషన్ అంతా మరిచిపోయింది. ఇప్పుడు ఇరా ఖాన్ తన భర్త నుపుర్ శిఖరేతో కలిసి ముంబైలో హ్యాపీ లైఫ్ గడుపుతోంది.


Click it and Unblock the Notifications











