twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Wild Dog day 1 collections మూవీ తొలి రోజు వసూళ్లు ఎంతంటే.. నాగ్‌ ముందు భారీ టార్గెట్

    |

    టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున మరో ఎమోషనల్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన వైల్డ్ డాగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాను ప్రేక్షకుల వద్దకు చేరవేసేందుకు రిలీజ్‌కు ముందు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సినిమాపై భారీగా హైప్ పెంచి వైల్డ్ డాగ్‌ను ఏప్రిల్ 2వ తేదీన రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్, వసూళ్ల అంచనా వివరాల్లోకి వెళితే....

    నిరాశ పరిచిన ఆఫీసర్, మన్మథుడు 2

    నిరాశ పరిచిన ఆఫీసర్, మన్మథుడు 2

    గత కొద్ది సంవత్సరాలుగా కింగ్ నాగార్జున కెరీర్, సక్సెస్ అంశాలు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. సోగ్గాడే చిన్నాయన, ఊపిరి చిత్రాలతో వరుస విజయాలు అందుకొంటే.. వర్మతో తీసిన ఆఫీసర్, రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన మన్మథుడు 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఈ క్రమంలో నాగార్జున‌ ఖాతాలో హిట్ తప్పనిసరిగా చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    భారీ రేటుకు నెట్‌ఫ్లిక్స్‌‌లో

    భారీ రేటుకు నెట్‌ఫ్లిక్స్‌‌లో

    వైల్డ్ డాగ్ సినిమా రిలీజ్‌కు ముందే ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన వ్యవహారాలు పూర్తయ్యాయి. ఈ సినిమా హక్కులను సుమారుు 28 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకొన్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ముందుగా ఈ సినిమాను ఓటీటీ ద్వారానే రిలీజ్ చేయాలనే ఆలోచన చేసినప్పటికీ.. నాగార్జున క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని థియేట్రికల్ రిలీజ్‌కు సిద్దపడ్డారు.

    వైల్డ్ డాగ్ ప్రీ రిలీజ్ బిజినెస్

    వైల్డ్ డాగ్ ప్రీ రిలీజ్ బిజినెస్

    వైల్డ్ డాగ్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో రూ.2.5 కోట్లు, సీడెడ్‌లో రూ.1.2 కోట్లు, ఆంధ్రాలో రూ.4 కోట్లతో మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ 7.7 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు సమాచారం. అలాగే కర్ణాటక, ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే.. 70 లక్షలు, ఓవర్సీస్ హక్కులు 50 లక్షల రూపాయలకు అమ్ముడుపోయినట్టు ట్రేడ్ వర్గాల రిపోర్ట్. దీంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.9 కోట్లు వసూలు చేయాల్సి ఉందనేది సమాచారం.

    తొలి రోజు వసూళ్ల అంచనా

    తొలి రోజు వసూళ్ల అంచనా

    అయితే వైల్డ్ డాగ్ తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్, కరెంట్ బుకింగ్‌ను పరిశీలించిన తర్వాత ఈ చిత్రం రూ.1 కోటి నుంచి 2 కోట్ల మధ్య వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు తెలియజేస్తున్నారు. వైజాగ్‌లో తొలి రోజు నూన్ షో వరకు ఈ చిత్రం రూ.90 లక్షలు, గాజువాకలో రూ.44 వేలు, అనకాపల్లిలో సుమారు రూ.20 వేలు, పలాసలో రూ. 15 వేలు వసూలు చేసినట్టు వార్తలు అందుతున్నాయి.

    9 కోట్ల బ్రేక్ ఈవెన్‌ లక్ష్యంతో

    9 కోట్ల బ్రేక్ ఈవెన్‌ లక్ష్యంతో

    బాక్సాఫీస్ వద్ద వైల్డ్ డాగ్ సినిమా సుమారు 9 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అయితే ఈ లక్ష్యాన్ని నాగార్జున ఛేదిస్తాడా అనేది ఈ వారాంతంలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్‌తో దూసుకెళ్తున్నది.

    English summary
    Wild Dog movie Day 1 expected collections worldwide
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X