ప్రపంచవ్యాప్తంగా పవన్ ఫీవర్.. అజ్ఞాతవాసి మానియా.. లక్ష్యం రూ.400 కోట్లా? ఇక వసూళ్ల రారాజేనా?
పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న అజ్ఞాతవాసి చిత్రం విడుదలకు ముందే ఎన్నో రికార్డులకు వేదికైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ అభిమానుల్లో అంచనాలు పెంచింది. ఈ చిత్రానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన విశేషాలు అభిమానుల్లో ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

శాటిలైట్ హక్కుల రికార్డు
అజ్ఞాతవాసి చిత్రం రిలీజ్‌కు ముందు టాలీవుడ్ చరిత్రను తిరగరాస్తూ అత్యధికంగా బిజినెస్ చేసింది. శాటిలైట్ హక్కులు 37 కోట్లకు అమ్ముడుపోవడం ఇండస్ట్రీ రికార్డు.

రిలీజ్‌కు ముందే 180 కోట్లు
అజ్ఞాతవాసి చిత్రం ప్రీ రిలీజ్‌కు ముందే దాదాపు 180 కోట్ల బిజినెస్ చేసినట్టు సమాచారం. టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఇదే రికార్డు. అజ్ఞాతవాసి ప్రీ రిలీజ్ పవన్ కల్యాణ్ స్టామినాకు అద్దం పడుతున్నది.

ఓవర్సీస్‌లో సెన్సేషనల్ రిలీజ్
అమెరికాతోపాటు ఓవర్సీస్‌లో అజ్ఞాతవాసి చిత్రం 575 స్క్రీన్లలో రిలీజ్ కానున్నది. అజ్ఞాతవాసి చిత్రం 209 ప్రదేశాల్లో రిలీజ్ అవుతుండగా, గతంలో బాహుబలి 126 లొకేషన్లలో, ఖైదీ నంబర్ 150 74 లొకేషన్లలో, కబాలి 73 లొకేషన్లలో, దంగల్ 69 లొకేషన్లలో రిలీజైంది.

బాహుబలి2 మీద కన్నేసిన అజ్ఞాతవాసి
అమెరికాలో బాహుబలి చిత్రం 4.5 మిలియన్లు, రజనీకాంత్ కబాలి 1.9 మిలియన్లు, బాహుబలి1 1.3 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అయితే ఈ రికార్డులను అజ్ఞాతవాసి తిరుగరాసే అవకాశం ఉంది.

400 కోట్ల వసూళ్లు
ట్రేడ్ అంచనాల ప్రకారం.. అజ్ఞాతవాసి చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.400 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఆ రేంజ్‌లో వసూళ్లు ఉంటే బాలీవుడ్ హీరోకు దీటుగా కలెక్షన్లు సాధించిన హీరోగా రికార్డులెక్కుతాడు. అంతేకాకుందా దక్షిణాదిలో కూడా కలెక్షన్ల రారాజుగా మారే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











