Prabhas Vs Jr NTR: కల్కి 90 కోట్లు.. సలార్ 81 కోట్లు.. దేవర అడ్వాన్స్ ఎన్ని కోట్లంటే?

జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రానికి అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కొద్ది రోజుల క్రితం ప్రారంభమవ్వగా.. రికార్డు స్థాయికి వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు సలార్, కల్కి సాధించిన ఓపెనింగ్స్‌తో పోటీ పడుతున్నది. ఈ సినిమా వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే..

దేవర అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాలు.. నైజాంలో ఈ సినిమా 20 కోట్ల రూపాయలు, వైజాగ్‌లో 5 కోట్లు, సీడెడ్‌లో 4.5 కోట్లు, కృష్ణా జిల్లాలో 3 కోట్ల రూపాయలు, గుంటూరులో 3 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 2 కోట్లు, నెల్లూరు జిల్లాలో 1.5 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 70 లక్షలు వసూలు చేసింది. స్పెషల్ షోలు కలుపుకొంటే ఇంకా ఎక్కువ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.

Will NTR s Devara break Prabhas Kalki 2898 AD and Salaar advance booking Worldwide

దేవర సినిమా రిలీజ్‌(సెప్టెంబర్ 27) కు ఒకరోజు (గురువారం) ముందు సాయంత్రం వరకు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి. ఆంధ్రా, తెలంగాణలో 32 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇక హైదరాబాద్‌లో 16 కోట్ల రూపాయలు నమోదు చేసింది. కర్ణాటకలో 4 కోట్ల రూపాయలు, బెంగళూరులో 3.5 కోట్లు, హిందీలో2.4 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి.

ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే.. అమెరికా, కెనడాలో భారీగా రెస్పాన్ ఉంది. తొలి రోజు కోసం అడ్వాన్స్ బుకింగ్, ప్రీమియర్లు కలిపితే ఈ మూవీ 3.5 మిలియన్ డాలర్లు అంటే.. 28 కోట్ల వరకు వసూలు చేయవచ్చు. ఇక ఓవరాల్‌గా ఈ సినిమా 5 మిలియన్ డాలర్లు వసూలు చేయవచ్చని పేర్కొంటున్నారు. దాంతో తొలి రోజు ఈ సినిమా ఓవర్సీస్‌లో 40 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని తెలిపారు.

Will NTR s Devara break Prabhas Kalki 2898 AD and Salaar advance booking Worldwide

ఇక ట్రేడ్ అనలిస్టుల ప్రకారం.. ఇటీవల భారీగా అడ్వాన్స్ బుకింగ్ సాధించిన ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. కల్కి చిత్రం 90 కోట్ల రూపాయల గ్రాస్, సలార్ మూవీ 81 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఒక రోజు ముందు వరకు 68 కోట్లు వసూలు చేసింది. అయితే తొలి రోజు వరకు దేవర ఆ రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లను అధిగమిస్తుందా? అనేది కొద్ది గంటల్లో తేలిపోతుంది.

More from Filmibeat

Read more about: ntr devara prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X