'సర్దార్' సమస్య :ఎంత లాస్, నష్టపరిహారం , అదే సీన్,రెమ్యునేషన్ వెనక్కి?
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తాజా చిత్రం'సర్దార్ గబ్బర్ సింగ్' రీసెంట్ గా ఉగాది రోజున రిలీజైన సంగతి తెలిసిందే. మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఎంత పబ్లిసిటీ పెంచినా, పవన్ ఎన్నడూ లేని విధంగా మీడియాకు ఇంటర్వూలు ఇచ్చినా పికప్ అయ్యే వాతావరణం కనపడటం లేదు.
ఈ నేపధ్యంలో చిత్రం రిజల్ట్ గురించి ట్రేడ్ లో లెక్కలు మొదలయ్యాయి. దాదాపు చాలా ఏరియాల్లో 50% పైగానే లాస్ వచ్చే అవకాసం ఉందని చెప్తున్నారు. దాంతో డిస్ట్రిబ్యూటర్స్, వారి దగ్గర నుంచి ఎన్. జి పద్దతిలో తీసుకున్న ఎగ్జిబిటర్స్ నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నట్లు చెప్తున్నారు. అంతేకాదు ఇప్పుడు ఈ ఫెయిల్యూర్ కు ఎవరు భాధ్యత వహించి ఒడ్డున పడేస్తారు అనే డిస్కషన్స్ హాట్ హాట్ గా జరుగుతున్నాయి.
బాహుబలి చిత్రం తర్వాత ఈ చిత్రానికే ఎక్కువ బిజినెస్ జరిగింది. 95 కోట్ల దాకా బిజినెస్ జరిగిందని అంచనా. దాంతో ఇప్పుడు ఈ లాస్ ఏ స్దాయిలో ఎవరు భరిస్తారు అనేది క్వచ్చిన్ గా కనపడుతోంది. నో గ్యారెంటి లెక్కలో తీసుకున్న ఎగ్జిబిటిర్స్ ..డిస్ట్కిబ్యూటర్స్ నిలదీస్తే..వారు పవన్ ని కలవక తప్పనిసరి పరిస్దితి.
ఇంతకు ముందు రజనీకాంత్ పెద్ద డిజాస్టర్ చిత్రం లింగా సమయంలో ఇలాంటి సీనే రిపీట్ అయ్యింది. రజనీకాంత్ లింగా చిత్రం వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఓ అశోశియేషన్ గా ఏర్పడి...రజనీని, నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ని కలవటం జరిగింది. ధర్నాలు వంటివి కూడా చేసారు. కాంపన్షేషన్ కోసం వారు పట్టుపట్టారు. ఇప్పుడు అలాంటి పరిస్ధితి తెలుగులో వచ్చే అవకాసం ఉందని అంటున్నారు.
తెలంగాణా పంపిణీ దారుల సంఘం సెక్రటరీ టి వెంకట కృష్ణ మాట్లాడుతూ... మా దగ్గర అయితే ఖచ్చితమైన లెక్కలు లేవు కానీ మా దగ్గర ఉన్న విశ్వనీయమైన సమాచారం ప్రకారం డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్డిబ్యూటర్స్ చాలా పెద్ద ఎత్తున లాస్ అవుతారు అని చెప్పారు.
తెలుగు చలన చిత్ర పరిరక్షణ సమితి ప్రెసిడెంట్ చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇలా పెద్ద సినిమాలు ఈ స్దాయిలో ఫ్లాఫ్ అవటం వల్ల ఆ నష్టం వెళ్లి చిన్న సినిమాలపై పడుతుంది. డిస్ట్రిబ్యూటర్స్ చిన్న సినిమా కొనే పరిస్ధితి ఉండదు.
మిగతా విషయాలు స్లైడ్ షోలో..

చాలా మంది..
డిస్ట్రిబ్యూటర్స్ లో చాలా మంది..నిర్మాత శరత్ మరార్ ని, పవన్ ని కలవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

డిమాండ్
తాము సర్దార్ చిత్రం వల్ల నష్టపోయిన మొత్తాన్ని కాంపన్షన్ గా ఇప్పించమని అడిగాలని వారి ఆలోచన.

పవన్ ఏమంటారో
పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూ మీద వెనక్కి డబ్బు తిరిగి ఇమ్మని చెప్తారని, ఆయన నిజాయితీ పరుడు కాబట్టి తమకు ఈ నష్టం కలగనీయడని భావిస్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్ ,ఎగ్జిబిటర్స్.

పూర్తిగా ఇస్తారా
ఇప్పుడు కాంపన్షేషన్ అంటే తాము నష్టపోయిన మొత్తం పూర్తిగా ఇస్తారా లేక రాక్ లైన్ వెంకటేష్..లింగా చిత్రానికి చేసినట్లు టెన్ పర్శంట్ ఇచ్చి దులుపుకుంటారనే ప్రశ్న అందరిలో మొదలుతోంది.

సాధారణంగా
సినిమా ఫ్లాఫ్ అయినప్పుడు తమ తదుపరి చిత్రంలో రికవరీ చేస్తామని డిస్ట్రిబ్యూటర్స్ కు సర్దిచెప్తూంటారు నిర్మాతలు

అందుకే వెంటనే
ఇలాంటి సమస్య వస్తుందని పసిగట్టిన పవన్ ..వెంటనే ఎస్ జె సూర్యతో సినిమా ప్రకటించారంటున్నారు.

హిందీలోనూ
హిందీ వెర్షన్ ని 12 కోట్లు పెట్టి తీసుకున్న ఈరోస్ వారు సైతం ఈ ప్రాజెక్టుతో దాదాపు మొత్తం లాస్ అయ్యారు.

మరో ప్రక్క పవన్
ఇదిలా పవన్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వూలలో తానే ఆర్దికంగా ఏం బాగోలేదని చెప్తూ వచ్చారు. తన స్టాఫ్ కు కూడా జీతాలు ఇవ్వలని పరిస్దితి అని ఆయన అన్నారు.

మొదటి రోజు బాగున్నా
ఈ సినిమా కలెక్షన్స్ తొలి రోజు రికార్డ్ లు బ్రద్దలు కొట్టినా , ఆ తర్వాత దారుణంగా డ్రాప్ అవటం మొదలెట్టాయి.

భాధ్యత ఎవరిది
ఈ ఫ్లాప్ కు కారణం ఇప్పుడు దర్శకుడు బాబి వహించాలా, లేక కథ,స్క్రీన్ ప్లే ఇచ్చి నటించిన పవన్ వహించాలా అన్నది పెద్ద ప్రశ్న.

అల్లు అరవింద్ ద్వారా
డిస్ట్రిబ్యూటర్స్ తో అల్లు అరవింద్ మాట్లాడి సెటిల్ చేసే అవకాసం ఉందని ట్రేడ్ లో వినపడుతోంది.

మిగతా ప్రాజెక్టులపై
సర్దార్ విషయం ప్రక్కన పెడితే తెలుగులో త్వరలోరానున్న భారీ చిత్రాల బిజినెస్ లపై ఈ ప్రభావం ఖచ్చితంగా పడుతుందని అంటున్నారు.

శాటిలైట్ సమస్యే
ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ భారీగా అమ్మారు. ఇప్పుడు ఈ సినిమా ఫ్లాఫ్ టాక్ రావటంతో కొనుక్కున్న ఛానెల్ వాళ్లు డైలమోలో పడినట్లు సమాచారం.

జంజీర్ రీమేక్ కన్నా
రామ్ చరణ్ చేసిన జంజీర్ రీమేక్ తో సర్దార్ ని పోలుస్తోంది బాలీవుడ్ మీడియా. ఇద్దరూ మెగా కుటుంబానికి సంభందించిన హీరోలు, పోలీస్ స్టోరీలే కావటం విశేషం.

ఎగ్డిబిటర్సే ఎక్కువ
ఈ సినిమాతో ఎక్కువగా నష్టపోతోంది ఎగ్జిబిటర్సే అని తెలుస్తోంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువ అడ్వాన్స్ లు తీసుకుని, నో గ్యారెంటీ పద్దతిపై సినిమాని ధియోటర్స్ కు ఇచ్చారు. పవన్ సినిమా కదా అని ఎక్కువ డబ్బే పెట్టారు ఎగ్జిబిటర్స్.

చిన్న టౌన్ లలో సైతం
చిన్న చిన్న టౌన్ లోని ఎగ్డిబిటర్స్ నుంచి నలభై లక్షలుదాకా అడ్వాన్స్ తీసుకుని అప్పుడు సినిమా ఇచ్చారు. అంతేకాకుండా ఫ్రాఫెట్ లో షేర్ అంటూ ఎగ్రిమెంట్స్ రాయించుకున్నారు.

మిగతాది కట్టం
చాలా చోట్ల ఎగ్డిబిటర్స్ తాము మొదట డిస్ట్రిబ్యూటర్స్ కు అడ్వాన్స్ గా ఇచ్చిన మొత్తంతో సరిపెట్టుకోమని , ఇంక కష్టలేమని చెప్తున్నట్లు సమాచారం.

లీగల్ గా వెళ్లం
ఓ ఎగ్డిబిటర్ చెప్పేదాని ప్రకారం..తమకు లీగల్ గా వెళ్లి తమ నష్టం వసూలు చేసే ఆలోచన లేదని, లాస్ అని అందరికీ తెలుసు కాబట్టి,ఓ అండర్ స్టాండిగ్ తో ఈ క్రైసిస్ నుంచి బయిటపడతాం అన్నారు.

ఛాంబర్ మాజీ ప్రెసిడెంట్ చెప్పేదేమిటంటే...
ఫిల్మ్ ఛాంబర్ మాజీ ఫ్రెసిడెంట్ చెప్పేదేమిటంటే..ఈ స్దాయి నష్టాలు వాటిల్లినప్పుడు ఎగ్జిబిటర్స్ కు తమ తదుపరి చిత్రం చాలా తక్కువ మొత్తాలకి ఇస్తామని డిస్ట్రిబ్యూటర్స్ ప్రామిస్ చేస్తారు.

చాలా సార్లు ఇలా
ఇలాంటి ఫ్లాఫ్ తో భారీ నష్టం జరిగినప్పుడు హీరోలు తమ రెమ్యునేషన్ ని తిరిగి ఇవ్వటం జరుగుతూంటుంది. మరి పవన్ ఏం చేస్తారో చూడాలి


Click it and Unblock the Notifications











