‘2000 కోట్ల కలెక్షన్లు గ్యారెంటీ.. రాజాసాబ్ రేంజ్ అలాంటింది’
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ది రాజా సాబ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు పాపులర్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఇషాన్ సక్సేనా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రభాస్‌తో సంజయ్ దత్, బోమన్ ఇరానీ, మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ పలని సినిమాటోగ్రాఫర్‌గా, ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రం 2026 సంవత్సరం జనవరి 9వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అవుతున్నది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం విడుదలకు సర్వం సిద్దమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.

ఈ వేడుకలో ప్రభాస్, మారుతితోపాటు హీరోయిన్లు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, చిత్ర నటీనటులు మహేష్ ఆచంట, సప్తగిరి, జరీనా వాహబ్, రోహిత్, బాలీవుడ్ నిర్మాత అనిల్ తడానీ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి లక్షలాది ప్రభాస్ ఫ్యాన్స్ తరలివచ్చారు. దాంతో వేడుక ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది.
నటుడు సప్తగిరి మాట్లాడుతూ.. ఈ మూవీలో చాలా మంది కమెడియన్లు ఉన్నారు. ఎంత మంది కమెడియన్లు ఉన్నా.. చాలా సన్నివేశాల్లో ప్రభాస్ చేసిన కామెడీ ముందు మేమంతా దిగదుడుపే. ఈ చిత్రంలో ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రభాస్ ద్వారా మారుతి క్రేజీగా చూపించారు. ప్రభాస్ సోలో పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది అని అన్నారు.
ప్రభాస్ అన్నతో సలార్ మూవీలో యాక్ట్ చేశాను. ఆ సినిమా ఇంటర్వెల్ చూసి 2 వేల కోట్ల రూపాయల కలెక్షన్స్ చేస్తుందని చెప్పాను. అలాగే జరిగింది. రాజా సాబ్ రిలీజ్ ట్రైలర్ ఇందాకే ప్రొడ్యూసర్ గారి ఫోన్ లో చూశాను. ట్రైలర్ ఒక రేంజ్ లో ఉంది. ఈ సినిమా కూడా తప్పకుండా 2 వేల కోట్ల రూపాయలు వసూళ్లు సాధిస్తుంది. ఫ్యాన్స్ అంతా కలిసి మేము ఆ మొత్తాన్ని అందిస్తాం అని సప్తగిరి కాన్ఫిడెన్స్‌గా చెప్పారు.
ప్రభాస్ అన్నను మనం వింటేజ్ లుక్ లో ఎలా చూడాలనకున్నామో అలా దర్శకుడు మారుతి గారు ఈ సినిమాలో చూపించారు. ఆయన ఇలా పూలు పట్టుకోవడం, రొమాంటిక్, వింటేజ్ లుక్ లో కనిపించడం మళ్లీ మనం కొన్నేళ్ల దాకా చూడలేం. ఎందుకంటే ఆయన యాక్షన్ మూవీస్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్నారు. ఈ సినిమాలో మా అందరి కన్నా ప్రభాస్ అన్నే ఎక్కువ మిమ్మల్ని నవ్విస్తాడు. మీతో పాటు నేను కూడా ప్రభాస్ అన్నను చూసేందుకు ఈ ఈవెంట్ కు వచ్చాను అని అన్నారు.


Click it and Unblock the Notifications











