twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి రికార్డుకు రాంచరణ్ ఎసరు!.. రంగస్థలం వసూళ్ల విజృంభణ

    By Rajababu
    |

    Recommended Video

    Rangasthalam To Became One Of Highest Grossers In Telugu cinema

    రంగస్థలం సినిమా రిలీజైన మొదటి ఆట నుంచే అద్భుతమైన టాక్‌తో దూసుకెళ్తున్నది. ఇప్పటివరకు ఉన్న నాన్ బాహుబలి బాక్సాఫీస్ రికార్డులపై రాంచరణ్ కన్నేశాడు. రంగస్థలం కలెక్షన్లపరంగా దూసుకెళ్తుండటంతో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 చిత్రం కలెక్షన్లను అధిగమిస్తుందా అనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతున్నది.

    దిమ్మతిరిగే ప్రీ రిలీజ్ బిజినెస్

    దిమ్మతిరిగే ప్రీ రిలీజ్ బిజినెస్

    సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమా టీజర్లు, ట్రైలర్లు, ఆడియో, పోస్టర్లు ప్రేక్షకులు విశేషంగా ఆకర్షించడం, ఆకట్టుకోవడంతో సినిమాకు మంచి హైప్ వచ్చింది. దాంతో శాటిలైట్, డిస్టిబ్యూషన్ హక్కులు రూ.80 కోట్లకు, హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.12 కోట్లకు అమ్ముడుపోయాయి.

    చిరంజీవి రికార్డు బ్రేక్

    చిరంజీవి రికార్డు బ్రేక్

    రంగస్థలం ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి రికార్డును రాంచరణ్ అధిగమించాడు. ఖైదీ నంబర్ 150 చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ 55 కోట్లు. కానీ రాంచరణ్ రంగస్థలం మాత్రం రూ.112 కోట్ల బిజినెస్ చేసేసింది. ఇండస్ట్రీలో రంగస్థలం ఓ కొత్త బిజినెస్ రికార్డును సొంతం చేసుకొన్నది.

    ప్రపంచవ్యాప్తంగా 2 వేల థియేటర్లు

    ప్రపంచవ్యాప్తంగా 2 వేల థియేటర్లు

    మార్చి 30న రిలీజైన రంగస్థలం చిత్రానికి విశేష స్పందన వస్తున్నది. తొలి ఆట నుంచే రికార్డుల మోత మోగుతున్నది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 వేల స్క్రీన్లలో రిలీజైంది. అడ్వాన్సు బుకింగ్ కలెక్షన్లు కూడా రికార్డు స్థాయిలో ఉన్నాయి.

    చిరంజీవి రికార్డుపై రాంచరణ్

    చిరంజీవి రికార్డుపై రాంచరణ్

    రంగస్థలం సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడటంతో ఖైదీ నంబర్ 150 చిత్రంతో చిరంజీవి సొంతం చేసుకొన్న 164 కోట్ల వసూళ్ల రికార్డులను రాంచరణ్ అధిగమిస్తాడా లేదా అనే చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తే మెగా హీరోల కలెక్షన్ల రికార్డులను రాంచరణ్ తిరగరాయడం ఖాయమనే మాట వినిపిస్తున్నది.

    ఆరో స్థానంలో రంగస్థలం

    ఆరో స్థానంలో రంగస్థలం

    ఓవర్సీస్ మార్కెట్లో ప్రధానం అమెరికాలో రంగస్థలం కలెక్షన్ల దుమ్ము దులిపేస్తున్నది. అమెరికాలో ప్రదర్శించిన తెలుగు సినిమాల ప్రీమియర్ల టాప్ 10 జాబితాలో రంగస్థలం ఆరోస్థానంలో నిలిచింది. బాహుబలి2 చిత్రం 24.5 లక్షల డాలర్లు వసూలు చేయగా, అజాతవాసి చిత్రం 15.2 లక్షల డాలర్లు, బాహుబలి1 చిత్రం 13.7 లక్షల డాలర్లు, ఖైదీ నంబర్ 150 చిత్రం 13 లక్షల డాలర్లు, స్పైడర్ 10 లక్షల డాలర్లు, రంగస్థలం 6.30 లక్షల డాలర్లు వసూలు చేయడం గమనార్హం.

    English summary
    Rangasthalam starring Ram Charan and Samantha Akkineni is this week’s big release in the south. The film directed by Sukumar has earned a positive buzz ahead of its release and the pre-booking in Telugu speaking states is quite encouraging, according to the trade. It is a film set in the 80s and unfolds in a village. The film also stars Adhi Pinisetty, Jagpathi Babu and Prakash Raj in pivotal roles. This movie eying on Chiranjeevi's Khaidi No 150 records.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X