Top Box Office Collections: ఇండియాలో టాప్ కలెక్షన్ల సినిమాలు ఇవే.. పెద్ది ఆ రికార్డులను బ్రేక్ చేస్తుందా?
భారతీయ సినిమా పరిశ్రమలో ధురంధర్ సినిమా తర్వాత అతిపెద్ద రిలీజ్‌గా పెద్ది సినిమా విడుదలకు సిద్దమైంది. మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాగా రిలీజ్‌కు ముస్తాబైంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో భారీ రిలీజ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపుతుందా? గతంలో భారతీయ బాక్సాఫీస్ వద్ద నమోదు చేసిన రికార్డు కలెక్షన్లను అధిగమిస్తుందా? అనే చర్చ ప్రస్తుతం సినీ అభిమానుల్లో కొనసాగుతున్నది. ఇప్పటి వరకు భారతీయ సినిమా రంగంలో అత్యధికంగా వసూలు చేసిన చిత్రాలు ఏంటి? పెద్ది ముందున్న లక్ష్యం ఏమిటనే వివరాల్లోకి వెళితే..
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యధికంగా కలెక్షన్లు నమోదు చేసిన చిత్రాల్లో ధురంధర్ 2, బాహుబలి 2, పుష్ప 2, ధురంధర్ 1, కేజీఎఫ్ 2, RRR, కల్కి చిత్రాలు ఉన్నాయి. రణ్‌వీర్ సింగ్ నటించిన రెండు చిత్రాలు, ప్రభాస్ నటించిన రెండు చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. అల్లు అర్జున్, యష్, రాంచరణ్ నటించి ఒక్కో చిత్రం టాప్ కలెక్షన్లు సాధించిన చిత్రాలుగా నమోదయ్యాయి.

స్వదేశంలో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన రికార్డులు తిరుగ రాసిన చిత్రాల్లో ధురంధర్ 2 చిత్రం 1812 కోట్ల రూపాయలు, బాహుబలి 2 చిత్రం 1788 కోట్ల రూపాయలు, పుష్ప 2 సినిమా 1742 కోట్ల రూపాయలు, ధురంధర్ చిత్రం 307 కోట్ల రూపాయలు, కేజీఎఫ్ 2 చిత్రం 1215 కోట్ల రూపాయలు, RRR 1230 కోట్ల రూపాయలు, కల్కి చిత్రం 1042 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
పెద్ది చిత్రం బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ చిత్రంలో నటించిన యాక్టర్లు, పనిచేసిన సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ చిత్రం బడ్జెట్ 350 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయల మేర అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. పెద్ది సినిమా థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. నైజాం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ భారీ రేటును చెల్లించి దక్కించుకొన్నారు. ఈ సినిమా తెలంగాణ థియేట్రికల్ రైట్స్ 63 కోట్ల రూపాయలకు, ఆంధ్రా రైట్స్ 75 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 27 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. దాంతో ఈ చిత్రం 165 కోట్ల రూపాయల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
అయితే పెద్ది చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. ఉత్తరాది, దక్షిణాది భాషల్లో ఈ సినిమాపై ప్రేక్షకులు దృష్టి సారించారు. అయితే ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టిన సినిమాల వసూళ్లను పెద్ది అధిగమిస్తుందా? రాంచరణ్ తన స్టామినాను నిరూపించుకొంటారా? అనేది ఇప్పడు ట్రేడ్ వర్గాల్లో భారీ చర్చ జరుగుతున్నది. ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేస్తుందా? ఇటీవల వచ్చిన ధురంధర్, పుష్ప 2 సినిమాల సరసన చేరుతుందా? అనే విషయం గురించి వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications