Don't Miss!
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాహుబలి x 2.O: రాజమౌళి, అమీర్ రికార్డులపై రజనీ.. 5 రికార్డులను అధిగమిస్తుందా?
భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన చిత్రం 2.0. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కాంబినేషన్లో సుమారు రూ.600 కోట్ల వ్యయంతో తెరకెక్కింది. భారతీయ సినిమా పరిశ్రమలో ఇంత మొత్తంలో రూపొందిన సినిమా ఇదే కావడం ఓ రికార్డు. అలాగే ఈ సినిమా విడుదలకు ముందే జరిగిన బిజినెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. రోబో2.0 సినిమా ముందున్న రికార్డులు ఇవే..
అమెరికాలో వసూళ్లను
ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి2 సినిమాపై ప్రస్తుతం పలు రికార్డులు నమోదై ఉన్నాయి. తొలి రోజు బాహుబలి2 చిత్రం అమెరికాలో $4,598,336 మేర వసూళ్లను సాధించింది. బాహుబలి2 చిత్రం 3 మిలియన్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. అయితే ఈ రికార్డులన్నింటిని 2.0 తిరగరాస్తుందా అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ వసూళ్లు
2018లో అమీర్ ఖాన్ నటించిన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రం హిందీలో అతిపెద్ద ఒపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ తొలి రోజున రూ.52 కోట్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం 2.0 చిత్రానికి ఉన్న ఆదరణ చూస్తే బాక్సాఫీస్ వద్ద అమీర్ ఖాన్ చిత్ర వసూళ్లను అధిగమిస్తుందా అనే ప్రశ్న చర్చనీయాంశమైంది.
2.0 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. రజనీ స్టయిల్ సూపర్, అక్షయ్ నటన హైలెట్.. భారత్‌కే గర్వంగా..
విజయ్ సర్కార్ రికార్డులను
తమిళ సూపర్‌స్టార్ విజయ్ నటించిన సర్కార్ చిత్రం తమిళనాడులో కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. దాదాపు 650 స్కీన్లలో రిలీజై తొలి రోజున రూ.31.6 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం 2.0 చిత్రం 650కి పైగా స్క్రీన్లలో రిలీజ్ అవుతున్నది. సర్కార్ చిత్ర కలెక్షన్లను అధిగమిస్తుందా లేదా అనే విషయాన్ని వేచి చూడాల్సిందే.
అక్షయ్ కుమార్ లెక్క తేలుతుందా?
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన చిత్రంగా 2.0 ఘనతను సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అక్షయ్ తొలి సినిమా కలెక్షన్లు రూ.25.25 కోట్లు మాత్రమే. హిందీ వెర్షన్లో ఈ చిత్రం రూ.30 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
బాహుబలి2 తొలిరోజు కలెక్షన్లు
బాహుబలి2 చిత్రం తొలి రోజున అన్ని రికార్డులను తిరగరాసింది. తొలి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డును నెలకొల్పింది. ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి 2 దేశవ్యాప్తంగా రూ.152 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.214 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ రికార్డును తిరుగరాస్తుందా అనేది వేచిచూడాల్సిందే.