చైనా బాక్సాఫీస్ పై కన్నేసిన విజయ్ సేతుపతి: దంగల్ రికార్డును గురిపెట్టిన మహారాజా
కొన్ని కొన్ని సినిమాలు ఆయా హీరోల కెరీర్లో ఒక మైలురాయిలా నిలిచిపోతాయి అని చెప్పాలి. ఏ హీరో అయినా ఎన్నో సినిమాలు చేసినప్పటికీ కేవలం కొన్ని సినిమాలు మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయి. కాగా అలాంటి సినిమాలకి ఆదరణ ప్రపంచ వ్యాప్తంగా కూడా రీచ్ ఉంటుంది. ఇక ఇపుడు ఉన్న ట్రెండ్ లో అయితే పలు సినిమాలు రీజనల్ గా పాన్ ఇండియా లెవెల్ నుంచి అలాగే పాన్ వరల్డ్ లెవెల్లో కూడా మన నుంచి వెళుతున్నాయి.
అయితే కొన్ని సినిమాలు అనౌన్స్ చేయడమే అలా చేసి వెళ్లడం వేరు అలాగే రీజనల్ నుంచి ఇతర దేశాల్లో విడుదల కావడం వేరు అని చెప్పాలి. మన ఇండియన్ సినిమాలకి పలు దేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా లాంటి దేశాలు మినహా జపాన్ లో చాలా సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అలాగే చైనా ఇంకా రష్యా లాంటి దేశాల్లో కూడా వెళ్తూ ఉంటాయి.

అయితే వసూళ్ల పరంగా చైనా మార్కెట్ చాలా పెద్దది అని చెప్పాలి. చైనా మార్కెట్ లో ఓకే సినిమా కానీ హిట్ అయితే దానికి వచ్చే వసూళ్లు ఊహించని లెవెల్లో ఉంటాయి. కాగా ఇండియన్ సినిమా నుంచి పలు సినిమాలు వెళ్లాయి కానీ వాటిలో ఆమీర్ ఖాన్ నటించిన "దంగల్" రికార్డు వసూళ్లు అందుకొని చరిత్ర సృష్టించింది. ఒక్క చైనా లోనే ఏకంగా 1400 కోట్లకి పైగా వసూళ్లు సాధించి ఇప్పటికీ చెక్కు చెదరని రికార్డుగా ఉంది.
అయితే దీని తర్వాత రజినీకాంత్, శంకర్ ల 2.0 వెళ్ళింది కానీ ఇది అక్కడ ప్లాప్ అయ్యింది. అయితే మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వెళుతున్న చిత్రమే "మహారాజ". తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన ఈ చిత్రం మన దగ్గర పెద్ద హిట్ అయ్యింది. మెయిన్ గా ఇందులో ఎమోషన్స్ అలాగే స్క్రీన్ ప్లే బాగా హైలైట్స్ అయ్యాయి. మరి అప్పుడు దంగల్ సినిమాలో కూడా సాలిడ్ ఎమోషన్స్ ఉండడంతో అదీ బాగానే వర్కవుట్ అయ్యింది.

మరి ఇపుడు మహారాజ కూడా వెళ్ళబోతున్నట్టు సేతుపతి తెలిపాడు. ఈ నవంబర్ 29న చైనాలో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారట. అన్నట్టు ఈ సినిమాని చైనీస్ లో వేరే టైటిల్ ని పెట్టారు. అందరికీ బాగా రీచ్ అయ్యేలా సినిమాలో థీమ్ కి తగ్గట్టుగా ఇండియాలో "మహారాజ" గా విడుదల అయ్యిన ఈ చిత్రం చైనాలో "కర్మ" అనే టైటిల్ తో విడుదల కాబోతున్నట్టుగా తెలిపారు.
అలాగే దీనికి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఉంది. "కర్మ - ఈవిల్ విల్ బి పనిష్డ్" అంటూ మంచి రీచ్ ఉండే టైటిల్ ని పెట్టారని చెప్పాలి. మరి ఈ ఆసక్తికర సినిమా అక్కడ ఎలాంటి వసూళ్లు అందుకుంటుందో చూడాలి. దంగల్ తరహాలోనే సర్ప్రైజింగ్ హిట్ అవుతుందా లేక 2.0 లానే ఆగిపోతుందా అనేది ఈ నెలాఖరు వరకు ఆగి చూస్తే తేలిపోతుంది.


Click it and Unblock the Notifications











