World Famous Lover collections: ఫస్ట్ డే వసూళ్లు ఎంతంటే?
విజయ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం భారీ రేంజ్‌లో ప్రపంచవ్యాప్తంగా 1150 థియేటర్లలో రిలీజైంది. టీజర్లు, ట్రైలర్లకు విశేష స్పందన రావడంతో అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి స్పందన లభించింది. ప్రేమికుల రోజు కానుకగా రిలీజైన ఈ చిత్రానికి సంబంధించిన తొలి రోజు మొదటి ఆటకు 45 శాతం అక్యుపెన్సీ రాగా, డివైడ్ టాక్‌తో ఆక్యుపెన్సీ 55 శాతానికి అందుకొన్నది. తొలి రోజు ఈ చిత్రం సాధించే కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్‌తో
విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్‌తో మల్టిప్లెక్స్‌లో హౌస్‌పుల్స్‌తో ప్రారంభమయ్యాయి. మాస్, సింగిల్ థియేటర్లలో వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ఓవరాల్‌గా 60 శాతం ఆక్యుపెన్సీని సాధించింది. ఏపీ, తెలంగాణలో ఫస్ట్ షో వరకు ఆక్యుపెన్సీ రేట్ పెరిగే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు
ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో విజయ్ దేవరకొండ సినిమాకు మంచి ఆదరణ ఉంటుందనేది గత చిత్రాలు నిరూపించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం సుమారు రూ.5.5 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్‌లో కూడా క్లాస్ ఆడియెన్స్ ఆదరణ లభించడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 6 కోట్లకుపైగా వసూళ్లను సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీ రిలీజ్ బిజినెస్
ఇక వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. నైజాంలో ఈ చిత్రం రూ.9 కోట్లు, సీడెడ్‌లో రూ.4 కోట్లు, ఆంధ్రాలో రూ.10 కోట్ల బిజినెస్ చేసింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ23 కోట్లు బిజినెస్ చేసింది.
Recommended Video


ఎంత వసూలు చేయాలంటే
ఇక కర్ణాటక, ఇతర రాస్ట్రాల థియేట్రికల్ హక్కులు, డబ్బింగ్ హక్కులు రూ.4 కోట్లకు అమ్ముడుపోగా, ఓవర్సీస్‌లో రూ.3.5 కోట్లు చేసింది. దీంతో మొత్తంగా రూ.30.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక ఈ సినిమా 24 కోట్లు వసూలు చేస్తే హిట్‌గా నమోదు అవ్వడం ఖాయం.


Click it and Unblock the Notifications











