World Famous Lover collections: ఫస్ట్ డే ఎంత వసూలు చేసిందంటే!

యువ హీరో విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం మిశ్రమ స్పందనతో బాక్సాఫీస్ వద్ద సత్తాను పరీక్షించుకొంటున్నది. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోలేకపోయింది. డివైడ్ టాక్‌తో ఈ చిత్రం తొలి రోజు భారీగానే వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ఫేమస్ లవర్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి..

ఏపీ, తెలంగాణలో ఎంతంటే

ఏపీ, తెలంగాణలో ఎంతంటే

World Famous Lover లవర్ చిత్రం తొలి రోజున ఏపీ, తెలంగాణలో మొత్తంగా 4.4 కోట్ల షేర్‌ను సొంతం చేసుకొన్నది. నైజాంలో రూ.2 కోట్లకుపైగా, సీడెడ్‌లో రూ.38 లక్షలకుపైగా, ఉత్తరాంధ్రలో రూ.52 లక్షలకుపైగా వసూలు చేసింది. అయితే గ్రౌండ్ లెవెల్‌లో ఉంటే అంచనాలను మించకపోవడం కొంత ఆందోళన కలిగిస్తున్నది.

 ఆంధ్రాలో కలెక్షన్లు

ఆంధ్రాలో కలెక్షన్లు

ఇంకా ఆంధ్రాలోని వివిధ ప్రాంతాల్లో తూర్పు గోదావరి జిల్లాలో రూ.31 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.24 లక్షలు, గుంటూరులో రూ43 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.25 లక్షలు, నెల్లూరులో రూ.18 లక్షలు వసూలు చేసింది. దాంతో ఏపీలో రూ.1.4 కోట్ల కలెక్షన్లు నమోదయ్యాయి.

 తెలుగేతర రాష్ట్రాల్లో

తెలుగేతర రాష్ట్రాల్లో

ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో భారీగా కలెక్షన్లను వరల్డ్ ఫేమస్ లవర్ సాధించలేకపోయింది. తెలుగేతర రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.48 లక్షలు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో రూ.65 లక్షలు రాబట్టింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.5.53 కోట్ల షేర్, రూ.9 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఎంత వసూలు చేస్తే హిట్ అంటే

ఎంత వసూలు చేస్తే హిట్ అంటే

World Famous Lover లవర్ సినిమా భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నైజాంలో ఈ చిత్రం రూ.9 కోట్లు, సీడెడ్‌లో రూ.4 కోట్లు, ఆంధ్రాలో రూ.10 కోట్లు రాబట్టింది. ఏపీ, తెలంగాణలో World Famous Lover రూ.23 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇక తెలుగేతర రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.3.5 కోట్లతో మొత్తంగా 30 కోట్లకుపైగా బిజినెస్ నమోదు చేసింది. ఈ చిత్రం హిట్ నమోదు చేసుకోవాలంటే ఇంకా 24 కోట్లకుపైగా వసూలు చేయాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X