షాకింగ్‌గా world famous lover కలెక్షన్లు.. 4వ రోజు ఎంత వసూలు చేసిందంటే!
టాలీవుడ్‌లో క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండకు వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం చేదు అనుభవాన్ని మిగిల్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. 4 రోజుల కలెక్షన్లను చూస్తే ఓ మోస్తారుగా లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్సీస్‌లో కూడా సినిమా వసూళ్లు అంతంతా మాత్రంగా ఉండటం.. పుంజుకొనే అవకాశాలు కూడా లేవనే టాక్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది. ఈ సినిమా 4 రోజులు కలెక్షన్లు ఇలా ఉన్నాయి..

ప్రతికూల అంశాలతో
వరల్డ్ ఫేమస్ లవర్ రిలీజ్‌కు ముందు కూడా పెద్దగా బజ్ లేకపోయినా.. విజయ్ దేవరకొండ క్రేజ్‌తో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ఈ సినిమా విమర్శకులు, సగటు ప్రేక్షకుల ప్రశంసలకు నోచుకోకపోవడం భారీగా దెబ్బ పడింది. దాంతో ఈ సినిమా కలెక్షన్లు రాబట్టడంలో ప్రతికూలత ఎదురైందనే మాట వినిపిస్తున్నది.

4వ రోజు వసూళ్లు
ఇక నాలుగో రోజు వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ఓవరాల్‌గా 1 కోటి రూపాయల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మొత్తంగా 4 వ రోజు 40 నుంచి 50 లక్షలు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల రిపోర్టు. ఇక చాలా చోట్ల ఆక్యుపెన్సీ 40 శాతం కూడా లేకపోవడంతో ఇక ముందు వసూళ్లలో మెరుగదల కనిపించకపోవచ్చనే మాట వినిపిస్తున్నది.

ఓవరాల్‌గా నాలుగు రోజుల కలెక్షన్లు
వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రానికి సంబంధించిన నాలుగు రోజుల కలెక్షన్లు ఇలా..
ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఈ చిత్రం రూ.7.10 కోట్లు
రెండో రోజు రూ.2.60 కోట్లు
మూడో రోజు రూ.2 కోట్లు
నాలుగో రోజు రూ.1 కోటి షేర్ సాధించింది. మొత్తంగా ఈ చిత్రం నాలుగు రోజుల్లో రూ.12.70 కోట్లు రాబట్టినట్టు స్పష్టమవుతున్నది.
Recommended Video


ఇంకా ఎంత రాబట్టాలంటే..
వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం నైజాంలో రూ.9 కోట్లు, సీడెడ్‌లో రూ.4 కోట్లు, ఆంధ్రాలో రూ.10 కోట్లు రాబట్టింది. ఏపీ, తెలంగాణలో World Famous Lover రూ.23 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇక తెలుగేతర రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.3.5 కోట్లతో మొత్తంగా 30 కోట్లకుపైగా బిజినెస్ నమోదు చేసింది. ప్రస్తుత పరిస్థితి చూస్తే చిత్రం హిట్ నమోదు చేసుకోవాలంటే ఇంకా 12 కోట్లకుపైగా వసూలు చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











