Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్‌కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జోకర్ కలెక్షన్ల సునామీ.. మరో మైలురాయి దాటేసి సరికొత్త రికార్డ్
జాక్విన్ ఫీనిక్స్ ముఖ్యపాత్రలో తెరకెక్కి సరికొత్త సంచలనాలకు తెరలేపుతోంది జోకర్ సినిమా. అక్టోబర్ 2వ తేదీన విడుదలైన ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తూ ప్రపంచ సినిమా బాక్సాఫీసునే షేక్ చేస్తోంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌ను అధిగమించి రికార్డులను తిరగరాస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విడుదల రోజు మొదలుకొని నేటికీ కలెక్షన్ల ప్రవాహం ఆగడం లేదు.
ప్రపంచవ్యాప్తంగా జోకర్ రాబట్టిన ఫిగర్ చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఇప్పటికే 999.1 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది జోకర్. వివాదస్ప చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన టాడ్ ఫిలిప్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం మంచి లాభాల్లో కొనసాగుతోంది. వార్నర్ బ్రదర్స్, డీసీ ఫిల్మ్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో గోల్డెన్ లయన్ బహుమతి కూడా గెలుచుకోవడం విశేషం.
తాజాగా జోకర్ సినిమా మరో అరుదైన ఘనతను సాధించింది. 1 బిలియన్ డాలర్ క్లబ్లో చేరి వావ్ అనిపించింది. భారత కరెన్సీలో చూస్తే ఈ మొత్తం 71,63,50,00,000 కోట్ల రూపాయలు. గతంలో ఇంతమొత్తం సాధించిన చిత్రాల్లో బిహైండ్ ఆక్వామాన్ ($1.15 బిలియన్), ది డార్క్ నైట్ రైసెస్ ($1.084 బిలియన్) ది డార్క్ నైట్ ($1.005 బిలియన్) ఉన్నాయి.
భారతదేశంలో కూడా అధిక వసూళ్లను సాధించిన జోకర్ సినిమా.. 785 మిలియన్ డాలర్లు సాధించిన ర్యాన్ రేడోల్స్ స్టారర్ 'డెడ్‌పూల్-2' చిత్రం రికార్డును బద్దలు కొట్టి పరుగులు పెడుతోంది.