సాహో కలెక్షన్ల సునామీ.. ఎక్కడ చూసినా అదే పరిస్థితి.. వారం తిరిగే సరికి ఎంత రాబట్టిందో తెలుసా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'సాహో' బాక్సాఫీస్ వద్ద గురువారంతో తొలివారం పూర్తి చేసుకుంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలుత మిశ్రమ స్పందన తెచ్చుకున్నపటికీ ఆ తర్వాత పుంజుకుంది. అన్ని ఏరియాల్లోనూ వసూళ్ల సునామీ సృష్టిస్తూ తొలివారంలో ఓ రేంజ్ బిజినెస్ చేసింది. పూర్తి వివరాల్లోకి పోతే..

విడుదలైన అన్ని ఏరియాల్లో

విడుదలైన అన్ని ఏరియాల్లో

ఫ్యాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళీ భాషల్లో విడుదలైంది సాహో. యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా భాషతో సంబంధం లేకుండా అన్ని ఏరియాల్లో డీసెంట్ గా రన్ అవుతూ భారీ వసూళ్లు రాబడుతోంది. మొదట్లో వచ్చిన నెగెటివ్ రివ్యూస్ సినిమాను ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి..

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి..

‘సాహో' మూవీ తొలివారం వసూళ్లు పరిశీలిస్తే.... తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 73.97 కోట్ల షేర్ వసూలు చేసింది. బాహుబలి 2 మూవీ తర్వాత అత్యధిక ఫస్ట్ వీక్ షేర్ సాధించిన సినిమాగా ‘సాహో' రికార్డులకెక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా చూస్తే..

విడుదలైన 5 రోజుల్లోనే 350 కోట్ల మార్క్ దాటేసిన సాహో.. ఈ రెండు రోజులు కాస్త నెమ్మదించింది. అయినప్పటికీ డీసెంట్ ఫిగర్ నమోదు చేసింది. మొత్తంగా చూస్తే తొలి వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సాహో సినిమా 370 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. ఈ మేరకు తాజాగా కొత్త పోస్టర్ విడుదల చేశారు మేకర్స్.

ప్రభాస్ రేంజ్ తెలిసేలా

ప్రభాస్ రేంజ్ తెలిసేలా

బాహుబలి సిరీస్ తో వరల్డ్ స్టార్ అయ్యాడు రెబర్ స్టార్ ప్రభాస్. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ సాహోపై అంచనాలు బాగా పెంచేసింది. అయితే ఆశించిన మేర కాకపోయినా ప్రభాస్ రేంజ్ తెలిసేలా దూసుకుపోతోంది సాహో. నెగెటివ్ టాక్ వచ్చినా కూడా ఈ రేంజ్‌లో దూసుకుపోవడం చూసి ఖుషీ అవుతున్నారు ప్రభాస్ ఫాన్స్.

సాహో మూవీ గురించి

సాహో మూవీ గురించి

తెలుగు సినీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమాల్లో ‘సాహో' ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాను దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో సుజిత్ తెరకెక్కించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించింది. పలు భాషల్లోని భారీ తారాగణం పాలుపంచుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X