WorldFamousLover రెండు రోజుల వసూళ్లు.. ఇదీ రౌడీ స్టార్ పరిస్థితి

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ 'వరల్డ్ ఫేమస్ లవర్' కలెక్షన్స్ అంత ఆశాజనకంగా లేవని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ రేంజ్‌ వసూళ్లు రావడం లేదు. తొలిరోజే మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ మూవీ రెండో రోజుకు చేరుకునే సరికి కాస్త డీలా పడింది. మరి ఈ రెండు రోజుల్లో మనోడి వసూళ్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దామా..

విజయ్ దేవరకొండ హంగామా.. రెండో రోజే

విజయ్ దేవరకొండ హంగామా.. రెండో రోజే


భారీ అంచనాల నడుమ లవర్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. విడుదల తర్వాత టాక్ సరిగా రాకపోవడంతో రెండో రోజే డ్రాప్స్ కనిపించాయి. రెండో రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఫస్ట్ డే తో పోల్చితే 40 నుంచి 45 శాతం మేర కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. మాస్ సెంటర్స్ అయితే చేతులెత్తేశాయని తెలుస్తోంది.

భారీ టార్గెట్‌.. సెకండ్ డే ఎఫెక్ట్

భారీ టార్గెట్‌.. సెకండ్ డే ఎఫెక్ట్

తొలిరోజు 5 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ వరల్డ్ ఫేమస్ లవర్.. రెండో రోజు 2.8 కోట్ల నుండి 3 కోట్ల షేర్ వసూలు చేశాడు. భారీ టార్గెట్‌తో బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగిన సినిమా ఆ టార్గెట్‌ని అందుకోవాలంటే ఈ కలెక్షన్స్ ఏమాత్రం సరిపోవని చెప్పుకోవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే రెండో రోజే ఈ సినిమాకు గండి పడిందని తెలుస్తోంది.

రెండు రోజుల్లో కలిపి మొత్తంగా చూస్తే..

రెండు రోజుల్లో కలిపి మొత్తంగా చూస్తే..


ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో వరల్డ్ ఫేమస్ లవర్ 8 కోట్ల షేర్ వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఫర్వాలేదనిపించినా.. రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో మాత్రం ఏ మాత్రం పెర్ఫార్మ్ చేయలేక పోతున్నాడు మన 'వరల్డ్ ఫేమస్ లవర్'.

ప్రీ రిలీజ్ బిజినెస్.. ఇదీ పరిస్థితి

ప్రీ రిలీజ్ బిజినెస్.. ఇదీ పరిస్థితి


విజయ్ దేవరకొండ చిత్రమంటే యూత్‌లో ఎనలేని క్రేజ్ ఉంటుంది. దానికి తగ్గట్టే విజయ్ చిత్రాలకు మంచి బిజినెస్ వస్తుంది. ఇదే బాటలో వరల్డ్ ఫేమస్ లవర్ కూడా భారీ రేటుకు అమ్ముడయింది. కానీ విడుదల తర్వాత 'వరల్డ్ ఫేమస్ లవర్' కలెక్షన్స్ ఊరట కలిగించడం లేదు.

మొత్తంగా 30 కోట్లు.. ఈ మార్క్ దాటాలంటే

మొత్తంగా 30 కోట్లు.. ఈ మార్క్ దాటాలంటే


తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర హక్కులు దాదాపు 23 కోట్లకు సేల్ అయ్యాయి. నైజాంలో రూ.9 కోట్లు, సీడెడ్‌లో రూ.4 కోట్లు, ఆంధ్రాలో రూ.10 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగేతర రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.3.5 కోట్లతో మొత్తంగా 30 కోట్లకుపైగా బిజినెస్ నమోదు చేసింది. సో ఈ మార్క్ దాటాలంటే మనోడు చాలా స్పీడ్ కావాల్సిన అవసరం ఉంది. చూడాలి మరి ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X