Writer Padmabhushan Day 2 collections రెండో రోజు పెరిగిన కలెక్షన్లు.. సుహాస్ మూవీకి భారీ రెస్పాన్స్

యువ హీరో సుహాస్, అందాల భామలు టీనా, శ్రీ గౌరీ ప్రియ నటించిన చిత్రం రైటర్ పద్మభూషణ్. చాయ్ బిస్కట్ ఫిలింస్, లహరీ మ్యూజిక్ బ్యానర్‌పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహరన్ నిర్మాతలుగా షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రంలో ఆశీష్ విద్యార్థి, రోహిణి, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజు గౌరవప్రదమైన వసూళ్లను రాబట్టింది. ఇక రెండో రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..

 ప్రపంచవ్యాప్తంగా భారీగా

ప్రపంచవ్యాప్తంగా భారీగా


రైటర్ పద్మభూషణ్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 400 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అమెరికాలో దాదాపు 150 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమాను సుమారు 6 కోట్లతో రూపొందించినట్టు సమాచారం. అయితే ఈ సినిమాను గీతా ఆర్ట్స్ ద్వారా సొంతంగా రిలీజ్ చేశారు. రైటర్ పద్మభూషణ్ సినిమాకు క్రేజ్ పెరగడంతో అమెరికా, యూకే, ఆస్ట్రేలియా కెనడా, తెలంగాణ, ఏపీ, చెన్నై, వెల్లూరు, బెంగళూరు, ముంబై, పూణే, ఒరిస్సాలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు.

 తొలిసారి థియేట్రికల్ రిలీజ్‌తో

తొలిసారి థియేట్రికల్ రిలీజ్‌తో


కలర్ ఫోటో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం తొలిసారి రైటర్ పద్మభూషణ్ ‌తో థియేట్రికల్ రిలీజ్ ద్వారా సుహాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మదర్ సెంటిమెంట్ నేపథ్యంగా సాగిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. రిలీజ్‌కు ప్రదర్శించిన ప్రీమియర్లకు ఏపీ, తెలంగాణలో స్పందన లభించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ఈ సినిమా 1.54 కోట్ల గ్రాస్ కలెక్షన్లను, 1 కోటీ షేర్ రాబట్టింది.

అమెరికాలో తొలి రోజు కలెక్షన్లు

అమెరికాలో తొలి రోజు కలెక్షన్లు


రైటర్ పద్మభూషణ్ సినిమాను ఓవర్సీస్‌లో ఫ్లయింగ్ హై సినిమాస్ రిలీజ్ చేసింది. చిన్న సినిమా అయినప్పటికీ ప్రీమియర్లు, తొలి రోజు కలెక్షన్లు భారీగానే రాబట్టింది. ఓవర్సీస్‌లో రైటర్ పద్మనాభం చిత్రం 100k డాలర్లను అమెరికా బాక్సాఫీస్ వద్ద వసూలు చేసింది. రెండో రోజు ఈ సినిమా కలెక్షన్లు తొలి రోజు కంటే బెటర్‌గా కనిపించాయి.

రెండో రోజు రైటర్ ఆక్యుపెన్సీ

రెండో రోజు రైటర్ ఆక్యుపెన్సీ


రైటర్ పద్యభూషణ్ చిత్రం రెండో రోజు పాజిటివ్ నోట్‌తో బాక్సాఫీస్ వద్ద జర్నీని మొదలుపెట్టింది. రెండో రోజు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో 48 ఆక్యుపెన్సీ, బెంగళూరులో 42 శాతం, చెన్నైలో 92 శాతం, విజయవాడలో 40 శాతం, వరంగల్‌లో 24 శాతం, గుంటూరులో 38 శాతం, వైజాగ్‌లో 27 శాతం, కాకినాడలో 40 శాతం ఆక్యుపెన్సీని రాబట్టింది.

 రెండో రోజు కలెక్షన్ల అంచనా

రెండో రోజు కలెక్షన్ల అంచనా


రైటర్ పద్మభూషణ్ సినిమాకు తొలి రోజు కంటే రెండో రోజు రెస్పాన్స్ ఎక్కువగా కనిపించింది. తొలి రోజు 1 కోటి షేర్ రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు 1.5 కోట్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 3 నుంచి 3.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X