Writer Padmabhushan Day 3 collections చిన్న సినిమాకు బ్లాక్‌బస్టర్ కలెక్షన్లు.. 3 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
కంటెంట్ పుష్కలంగా ఉన్న చిత్రాలకు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందని తాజాగా మరోమారు నిరూపించిన చిత్రం రైటర్ పద్మభూషణ్. సుహాస్, టీనా, శ్రీ గౌరీ ప్రియ, రోహిణి, ఆశీష్ విద్యార్థి, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫీల్ గుడ్ చిత్రం బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించిన ఈ సినిమా మౌత్ టాక్‌తో కలెక్షన్లను పెంచుకొంటూ పోతున్నది. ఈ చిత్రం గత 3 రోజుల్లో ఏ మేరకు కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..

మదర్ సెంటిమెంట్‌తో
రైటర్‌గా రాణించాలనే మధ్య తరగతి యువకుడికి ఎదురైన కష్టాలు.. తన జీవితాశయంగా మారిన కల నెరవేరిందా? అనే మెయిన్ పాయింట్‌కు మదర్ సెంటిమెంట్ జోడించిన చిత్రంగా రైటర్ పద్మభూషణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పక్కా మధ్య తరగతి కుటుంబ నేపథ్యంగా చిన్న చిన్న ఎమోషన్స్‌తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. సినిమా రిలీజ్‌కు ముందే 27 ప్రీమియర్లు ప్రదర్శించిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కుతున్నది.

తొలి రెండు రోజుల్లో వసూళ్లు
రైటర్ పద్మభూషణ్ సినిమా విషయానికి వస్తే.. తొలి రోజు అంటే శుక్రవారం ఇండియావైడ్‌గా 1 కోటి రూపాయల షేర్, ప్రపంచవ్యాప్తంగా 1.5 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక రెండో రోజు మౌత్ టాక్‌తో తొలి రోజు కంటే ఎక్కువగా వసూళ్లు సాధించింది. శనివారం 1.48 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా 3.6 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 5 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.

రైటర్ పద్మభూషణ్ మూడో రోజు ఆక్యుపెన్సీ
ఇక రైటర్ పద్మభూషణ్ మూడో రోజు కూడా భారీగా రెస్పాన్స్‌ను కూడగట్టుకొన్నది. హైదరాబాద్‌లో 55 శాతం, బెంగళూరులో 39 శాతం, చెన్నైలో 66 శాతం, విజయవాడలో 42 శాతం, వరంగల్‌లో 34 శాతం, గుంటూరులో 40 శాతం, వైజాగ్‌లో 26 శాతం, నిజమాబాద్‌లో 12 శాతం, ఢిల్లీలో 58 శాతం, ముంబైలో 33 శాతం, కాకినాడలో 49 శాతం, నెల్లూరులో 25 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

ఓవర్సీస్‌లో దుమ్మురేపుతున్న రైటర్
రైటర్ పద్మభూషణ్ సినిమాకు ఓవర్సీస్‌లో భారీ వసూళ్లు రాబడుతున్నది. తొలి రోజున ప్రీమియర్లతోపాటు అమెరికాలో 87 వేల అమెరికన్ డాలర్లు, యూకేలో 4 వేల పౌండ్లు, ఆస్ట్రేలియాలో 5.5 వేల డాలర్లు రాబట్టింది. మూడో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఓవర్సీస్‌లో 200K డాలర్లు అంటే 1.64 కోట్ల రూపాయలు రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల కలెక్షన్లు
ఇక రైటర్ పద్మభూషణ్ సినిమాను సుమారు 3 కోట్ల రూపాయాల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాకు అయిన బడ్జెట్‌ను డిజిటిల్, ఓటీటీ బిజినెస్ ద్వారా రాబట్టింది. ఇక మూడో రోజు కలెక్షన్లు విషయానికి వస్తే.. ఇండియాలో 1.9 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 9 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











