Writer Padmabhushan day4 collections ఫీల్‌గుడ్ టాక్‌తో రైటర్ పద్మభూషణ్ సూపర్ హిట్..4 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
మేజర్ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన చాయ్ బిస్కట్, ప్రముఖ మ్యూజిక్ సంస్థ లహరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం రైటర్ పద్మభూషణ్. కలర్ ఫోటోతో ప్రశంసలు అందుకొన్న సుహాస్, యువ తారలు టీనా, శ్రీ గౌరి ప్రియ నటించిన ఈ చిత్రం ఫీల్‌గుడ్ టాక్‌తో మంచి రెస్పాన్స్ అందుకొంటున్నది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన రైటర్ పద్మభూషణ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతున్నది. గత 4 రోజుల్లో ఈ చిత్రం ఏ రేంజ్ కలెక్షన్లు రాబట్టిందనే విషయంలోకి వెళితే..

ప్రీమియర్లతో బజ్ క్రియేట్ చేసి..
మదర్ సెంటిమెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రైటర్ పద్మభూషణ్ సినిమా వచ్చింది. అయితే కంటెంట్‌పై మంచి నమ్మకం ఉండటంతో రిలీజ్‌కు వారం రోజుల నుంచే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 30 షోలు ప్రదర్శించారు. అయితే ప్రీమియర్ల ద్వారా ఈ సినిమా మంచి బజ్ ఏర్పడంది. ఫిబ్రవరి 3వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రిలీజ్‌కు ముందే లాభాలు
రైటర్ పద్మభూషణ్ చిత్రం చిన్న బడ్జెట్‌తో తక్కువ మంది నటీనటులతో తెరకెక్కించారు. ఈ సినిమాను 3 కోట్ల రూపాయాలతో పూర్తి చేశారు. అయితే రిలీజ్‌కు ముందే శాటిలైట్, ఓటీటీ, డిజిటల్ బిజినెస్‌తో 3 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. రిలీజ్‌కు ముందే లాభాలతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

తొలి మూడు రోజుల కలెక్షన్లు
రైటర్ పద్మభూషణ్ చిత్రం తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో మంచి స్పందనను సంపాదించుకొన్నది. తొలి రోజు 65 లక్షల షేర్, రెండో రోజు 1.1 కోట్ల షేర్, మూడో రోజు 1.2 కోట్ల షేర్ రాబట్టింది. దాంతో ఇండియా వైడ్‌గా ఈ చిత్రం 3 కోట్ల షేర్ సంపాదించింది. తొలివారంలోనే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకొన్నది.

ఓవర్సీస్‌లో మంచి రెస్పాన్స్‌తో
రైటర్ పద్మభూషణ్ చిత్రం అమెరికా, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో తక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అయినా మంచి వసూళ్లను సాధిస్తున్నది. తొలి రోజు నుంచి భారీ వసూళ్లు రాబట్టింది. గత నాలుగు రోజుల్లో ఈ చిత్రం ఓవర్సీస్‌లో 225K డాలర్లను రాబట్టింది.

4వ రోజు ఆక్యుపెన్సీ
రైటర్ పద్మభూషణ్ తొలివారాంతం తర్వాత సోమవారం కూడా మంచి ఆక్యుపెన్సీని నమోదుచేసింది. హైదరాబాద్‌లో 27 శాతం, బెంగళూరులో 12 శాతం, చెన్నైలో 24 శాతం, వరంగల్‌లో 18 శాతం, విజయవాడలో 20 శాతం, వైజాగ్‌లో 20 శాతం, కాకినాడలో 33 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది.

4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా
ఇక నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఓవర్సీస్‌లో సుమారు 1.8 కోట్లు రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, చెన్నైతోపాటు 4వ రోజు 60 లక్షలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం సుమారు 6 కోట్లు వసూలు చేసింది. ఈ వారం ముగిసేలోగా ఇంకా భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











