Writer Padmabhushan Day 6 collections నిలకడగా పద్మభూషణ్ కలెక్షన్లు.. బాక్సాఫీస్ వద్ద సుహాస్ మ్యాజిక్!

రైటర్ పద్మభూషణ్ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తున్న చిన్న చిత్రంగా ఆదరణను కూడగట్టుకొంటున్నది. మేజర్ లాంటి సినిమాను అందించిన చాయ్ బిస్కట్, ప్రముఖ మ్యూజిక్ కంపెనీ లహరీ అందించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల స్పందనను అందుకొనేందుకు ప్రయత్నిస్తున్నది. ఫిబ్రవరి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్‌లో కూడా మంచి కలెక్షన్లు రాబడుతున్నది. ఈ చిత్రం 6వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

మౌత్ టాక్‌తో నిలకడగా కలెక్షన్లు

మౌత్ టాక్‌తో నిలకడగా కలెక్షన్లు

రైటర్ పద్మభూషణ్ చిత్రం మదర్ సెంటిమెంట్ ఆధారంగా వచ్చి మహిళ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. విడుదలకు ముందే ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో పలు నగరాల్లో 27 ప్రీమియర్లు వేశారు. దాంతో మౌత్ టాక్ ద్వారా ఈ సినిమాకు మంచి ఓపెన్సింగ్స్ వచ్చాయి. అలా బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లు రాబడుతున్నది.

ఉచితంగా ప్రీమియర్ షోలు

ఉచితంగా ప్రీమియర్ షోలు

కంటెంట్, కాన్సెప్ట్ ప్రధానంగా వచ్చిన రైటర్ పద్మభూషణ్ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు నిర్మాతలు రకరకాల ప్రమోషన్స్ స్ట్రాటజీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మహిళలకు ప్రత్యేకంగా ప్రదర్శించిన ఉచిత షోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో తొలివారం బాక్సాఫీస్ వద్ద నిలకడగా సినిమా నిలబడేందుకు దోహదపడింది.

6వ రోజు ఇండియాలో ఆక్యుపెన్సీ

6వ రోజు ఇండియాలో ఆక్యుపెన్సీ

ఇండియాలో రైటర్ పద్మభూషణ్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగు వెర్షన్‌ను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ ప్రాంతాల్లో ప్రదర్శిస్తున్నారు. తొలివారం వర్కింగ్ డే రోజున కూడా మోస్తారు ఆక్యుపెన్సీ కనిపించింది. హైదరాబాద్‌లో 27 శాతం, బెంగళూరు 12 శాతం, చెన్నై 29 శాతం, విజయవాడ 18 శాతం, గుంటూరు 29 శాతం, వైజాగ్ 24 శాతం, కాకినాడ 30 శాతం కలెక్షన్లు రాబట్టింది.

రైటర్ పద్మభూషణ్ 6 రోజుల కలెక్షన్లు

రైటర్ పద్మభూషణ్ 6 రోజుల కలెక్షన్లు

గత 6 రోజుల రైటర్ పద్మభూషణ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియావైడ్ తొలి రోజు 65 లక్షల షేర్, రెండో రోజు 1.1 షేర్, మూడో రోజు 1.2 కోట్ల షేర్, నాలుగో రోజు 61 లక్షల షేర్, ఐదో రోజు 60 లక్షల షేర్, ఆరో రోజు 56 లక్షల షేర్ సాధించింది. దాంతో ఈ చిత్రం 4.71 కోట్ల షేర్, 7 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఓవర్సీస్‌లో వసూళ్ల ధమాకా

ఓవర్సీస్‌లో వసూళ్ల ధమాకా

ఇక ఓవర్సీస్‌లో రైటర్ పద్మభూషణ్‌కు మంచి స్పందన లభిస్తున్నది. ఈ చిత్రం ఇప్పటి వరకు 300K డాలర్లను రాబట్టింది. యూఎస్ఏలో 100 స్క్రీన్లలో ప్రదర్శిస్తుండగా.. యూకే, ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో పరిమితంగా స్క్రీనింగ్ జరుగుతున్నది. దాంతో ఈ చిత్రం 2.5 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్ సుమారు 10 కోట్ల రూపాయాల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

రైటర్‌ పద్మభూషణ్‌కు తొలి రోజు నుంచే లాభాలు

రైటర్‌ పద్మభూషణ్‌కు తొలి రోజు నుంచే లాభాలు

రైటర్ పద్మభూషణ్ సినిమా విషయానికి వస్తే.. సుమారు 3 కోట్ల బడ్జెట్‌తో రూపొందినట్టు సమాచారం. అయితే ఈ బడ్జెట్‌ను డిజిటల్, శాటిలైట్ రూపంలో విడుదలకు ముందే రాబట్టినట్టు తెలుస్తున్నది. దాంతో ఈ సినిమా తొలి రోజు నుంచే లాభాల బాట పట్టింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన చిన్న సినిమాగా ఓ ఘనతను సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X