Writer Padmabhushan Day 9 collections వసూళ్ల జోరు తగ్గని రైటర్ పద్మభూషణ్.. ఎన్ని కోట్ల లాభమంటే?

టాలీవుడ్‌లో చిన్న చిత్రంగా రిలీజై భారీ విజయం అందుకొన్న చిత్రాల్లో ఒకటిగా రైటర్ పద్మభూషణ్ సినిమా నిలిచింది. కలర్ ఫోటోతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన నటుడు సుహాస్, టీనా, శ్రీ గౌరి ప్రియ, రోహిణి, ఆశీష్ విద్యార్థి, గోపరాజు రమణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటూ స్టడీగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ సినిమా 9 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

తొలి రోజు నుంచే రైటర్‌కు భారీ ఒపెనింగ్స్

తొలి రోజు నుంచే రైటర్‌కు భారీ ఒపెనింగ్స్

రైటర్ పద్మభూషణ్ చిత్రం తొలి రోజు నుంచే మంచి రెస్పాన్స్ కూడగట్టుకొన్నది. మదర్ సెంటిమెంట్ పాయింట్‌తో రూపొందిన ఈ చిత్రం రిలీజ్‌కు ముందే నిర్మాతలు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్లు వేశారు. దాంతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. అలా రైటర్ పద్మభూషణ్ చిత్రం మంచి ఒపెనింగ్స్ లభించాయి.

తొలివారం కలెక్షన్ల జోరు

తొలివారం కలెక్షన్ల జోరు


ఇక రైటర్ పద్మభూషణ్ సినిమా తొలివారం కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు 65 లక్షలు, రెండో రోజు 1.1 కోట్లు, మూడో రోజు 1.2 కోట్లు, నాలుగో రోజు 50 లక్షలు, ఐదో రోజు 46 లక్షలు, ఆరో రోజు 35 లక్షలు, ఏడో రోజు 28 లక్షలు వసూలు చేసింది. దాంతో తొలివారం తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో ఈ చిత్రం 4.5 కోట్లకుపైగా షేర్ రాబట్టింది.

రెండోవారంలో రైటర్ పద్మభూషణ్ నిలకడగా

రెండోవారంలో రైటర్ పద్మభూషణ్ నిలకడగా


రైటర్ పద్మభూషణ్ సినిమా రెండోవారం కూడా నిలకడగా బాక్సాఫీస్ వద్ద కనిపించింది. రెండోవారం తొలి రోజు 30 లక్షల షేర్, రెండో రోజు 35 లక్షల షేర్ రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో సుమారు 5.2 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇటీవల కాలంలో చిన్న బడ్జెట్ చిత్రం ఈ రేంజ్‌లో వసూలు చేయడం ఇదే అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఓవర్సీస్‌లో రైటర్ పద్మభూషణ్

ఓవర్సీస్‌లో రైటర్ పద్మభూషణ్

రైటర్ పద్మభూషణ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో ముఖ్యంగా అమెరికాలో భారీగా కలెక్షన్లు సాధించింది. తొలి రోజు నుంచి మంచి స్పందనను కూడగట్టుకోవడంతో మీడియం రేంజ్ సినిమాకు లభించిన కలెక్షన్లు అమెరికాలో నమోదయ్యాయి. గత తొమ్మిది రోజుల్లో ఈ చిత్రం 320K డాలర్లను అంటే.. 2.5 కోట్లకుపైగా రాబట్టింది.

గత 9 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

గత 9 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?


ఇక రైటర్ పద్మభూషణ్ సినిమా తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లో మోస్తారుగా కలెక్షన్లు సాధిస్తూ 10 కోట్ల మార్కుకు చేరువయయ్యేందుకు ప్రయత్నిసున్నది. తెలుగులో అమెరికాలో కలిపి 8.75 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇంకా రెండోవారంలో ఈ సినిమా నిలకడగా కనిపించడం వల్ల బాక్సాఫీస్ వద్ద మరికొంత కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X