గుంటూరులో యమదొంగ శతదినోత్సవం!!
ఎవరికీ తెలియకుండా యమదొంగ సినిమా శతదినోత్సవ వేడుకలను గుంటూరులో జరుపుకున్నారు. ది గ్రేట్ నందమూరి ఫ్యాన్స్, విజయా టాకీస్ సెంటర్ వారు సంయుక్తంగా శ్రీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ లో ఈ వెడుకను నిర్వహించారు. గుంటూరు జిల్లానుంచి అభిమానులు ఈ వేడుకలకు హాజరయ్యారు. రాష్ట్ర ఎన్టీఆర్ ఫ్యాన్స్ కో-ఆర్డినేటర్ పుల్లా సుందరం బాబు, జిల్లా ఫ్యాన్స్ అధ్యక్షుడు మద్ది రామకృష్ణ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా సురేష్ మూవీస్ మేనేజర్ మాదల రత్తయ్య చౌదరి హాజరయ్యారు. జిల్లాలో 10 కేంద్రాలలో 100 రోజులను పూర్తి చేసుకున్న యమదొంగ సినిమా బిజినెస్ పరంగా టాప్2 పొజిషన్ కు చేరుకుంది. ఈ సందర్భంగా అభిమానులు థియేటర్ సిబ్బందికి నూతన వస్త్రాలు బహుకరించారు. ప్రేక్షకులకు స్వీట్లు పంచారు. థియేటర్ ముందు పెద్దయెత్తున బాణాసంచా కాల్చారు.


Click it and Unblock the Notifications











