Yamadonga Re Release Collections: యమదొంగ రీ రిలీజ్ కలెక్షన్లు.. జూ ఎన్టీఆర్ మూవీ కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందిన యమదొంగ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొన్నది. విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందించిన ఈ సినిమాను చెర్రీ అలియాస్ చిరంజీవి, గంగరాజు గున్నం నిర్మించారు. ఈ సినిమాలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు, ప్రియమణి, మమతా మోహన్ దాస్, రంభ ప్రత్యేకమైన పాటలో నటించారు. సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను లేటేస్ట్ హంగులతో రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు, వివరాల్లోకి వెళితే..

స్వర్గీయ ఎన్టీఆర్ నటించిన యమగోల సినిమాను స్పూర్తిగా తీసుకొని యమదొంగ చిత్రాన్ని రూపొందించారు. యుముడు, చిత్ర గుప్తుడు తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయి నరకానికి వెళ్లిన ఓ యువకుడు తిరిగి తన ప్రాణాలు దక్కించుకొని భూమికి చేరుకోవడమే కాకుండా.. కష్టాల్లో ఉన్న తన వారిని ఎలా రక్షించుకొన్నాడనే కథతో ఈ సినిమాను రూపొందించారు. పౌరాణికం, డ్రామా, ఎమోషన్స్, హీరో ఎలివేషన్స్‌ లాంటి అంశాలతో ఈ సినిమాను రూపొందించారు.

Yamadonga Re Release Collections

యమదొంగ సినిమాకు ఉన్నతమైన సాంకేతిక నిపుణులు పనిచేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. 2007లో రిలీజైన ఈ సినిమాలోని పాటలు హిట్ సాంగ్స్‌గా నిలిచాయి. ఈ సినిమాకు సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా వ్యవహరించారు. సుమారు 3 గంటల నిడివి ఉన్న ఈ సినిమా నిర్మాణం కోసం 18 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు ట్రేడ్ రిపోర్ట్.

రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ కారణంగా యమదొంగ సినిమాకు భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. ఈ సినిమాకు మొదటి నుంచి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో ఆంధ్రా, నైజాంలో కలిపి 40 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 4.5 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా సుమారుగా 3 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 48.5 కోట్ల గ్రాస్, 38 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తెలుగు సినిమా పరిశ్రమలో లేటేస్ట్ రిలీజ్ కంటే పాత సినిమాల రీ రిలీజ్‌ల హవా ఎక్కువగా కొనసాగుతున్నది. ఈ క్రమంలో యమదొంగ ప్రింట్‌ను డిజిటల్‌లోకి మార్చారు. ఈ సినిమాను మొదట 8k వెర్షన్‌లోకి మార్చి.. అనంతరం క్వాలిటీ కోసం 4k క్వాలిటీలోకి మార్చారు. లేటేస్ట్ స్టాండర్డ్స్ ప్రకారం ఆడియోను ఇంప్రూవ్ చేసి విడుదల చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం మే 20వ తేదీ. ఈ సందర్భంగా యమదొంగ సినిమాను తెలుగు రాష్ట్రాల్లోను, ఓవర్సీస్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ చేయలేకపోవడం వల్ల అభిమానులకు చేరువ కాలేకపోయింది. అయినా ఈ సినిమాకు 1 నుంచి 1.5 కోట్ల రూపాయల అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు 1.5 నుంచి 2 కోట్ల మధ్య ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Read more about: yamadonga jr ntr ss rajamouli
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X