Article 370 Movie 29 Days Collections: 100 కోట్లతో ప్రియమణి సంచలనం.. ఇండియాలో తొలి సినిమాగా రికార్డు
గతంలో కంటే ఇప్పుడు కాంట్రవర్శీ స్టోరీలతో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి వాటికే ప్రేక్షకులు మంచి స్పందనను అందిస్తున్నారు. దీంతో మరిన్ని మూవీలు రూపొందుతున్నాయి. అలా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'ఆర్టికల్ 370' (Article 370). భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైన ఓ ఆర్టికల్ రద్దుకు ముందు జరిగిన మిషన్ ఆధారంగా ఈ మూవీ రూపొందింది. దీనికి మంచి టాక్ రావడంతో వసూళ్లు భారీ స్థాయిలోనే లభిస్తున్నాయి. మరి 'ఆర్టికల్ 370' మూవీ 29 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!
క్రేజీ కథతోనే ఆర్టికల్ 370
యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో ఆదిత్య సుహాస్ జంభలే రూపొందించిన కాంట్రవర్శీ మూవీనే 'ఆర్టికల్ 370'. జియో స్టూడియోస్, బీబీ6 స్టూడియోస్ బ్యానర్లపై జ్యోతి దేశ్‌పాండే, ఆదిత్య ధర్, లోకేష్ నిర్మించారు. షశ్‌వత్ సచ్‌దేవ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఇందులో ప్రియమణి, అరుణ్ గోవలీ, వైభవ్, కిరణ్ కర్మాకర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

ఆర్టికల్ 370 మూవీ బిజినెస్
రియల్ ఇన్సిడెంట్ల ఆధారంగా రూపొందిన 'ఆర్టికల్ 370' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో హైప్ ఏర్పడింది. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ మూవీకి దాదాపు రూ. 40 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 2000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
29వ రోజు ఎంత వచ్చింది
ఆదిత్య సుహాస్ జంభలే డైరెక్షన్‌లో రూపొందిన 'ఆర్టికల్ 370' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాకు ఓపెనింగ్స్ డీసెంట్‌గా లభించాయి. దీంతో ఎవరూ ఊహించని విధంగా ఈ చిత్రం తర్వాత కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. ఇలా 29వ రోజు ఈ మూవీకి రూ. 30 లక్షలు వరకూ నెట్ వసూళ్లు లభించాయి.

29 రోజులకూ కలిపి ఎంత
యామీ గౌతమ్, ప్రియమణి నటించిన 'ఆర్టికల్ 370' మూవీకి మొదటి వారంలో రూ. 35.60 కోట్లు నెట్ కలెక్షన్లు వచ్చాయి. రెండో వారంలో రూ. 22.30 కోట్లు, మూడో వారంలో రూ. 11.15 కోట్లు, నాలుగో వారంలో రూ. 4.80 కోట్లు వసూలు అయ్యాయి. ఇక, 29వ రోజు వసూళ్లతో కలిపి ఈ సినిమాకు ఇప్పటి వరకూ రూ. 74.15 కోట్లు షేర్‌తో పాటు రూ. 100.50 కోట్లు గ్రాస్ రాబట్టింది.
ఓవర్సీస్‌లో కలిసి ఎంత?
'ఆర్టికల్ 370' మూవీకి వాస్తవానికి ఇండియా మొత్తంలో 29 రోజుల్లో రూ. 88 కోట్లు గ్రాస్ వసూలు అయింది. అయితే వరల్డ్ వైడ్‌గా ఇది తక్కువ థియేటర్లలోనే రావడంతో ఓవర్సీస్‌లో కేవలం రూ. 12.50 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇలా ఇప్పటి వరకూ 'ఆర్టికల్ 370' 100 కోట్లు దాటింది. తద్వారా లేడీ ఓరియెంటెడ్‌గా వచ్చి వేగంగా వంద కోట్లు కొట్టిన చిత్రంగా నిలిచింది.

టార్గెట్ ఇలా.. లాభం అలా
సున్నితమైన కథాంశంతో రూపొందిన 'ఆర్టికల్ 370' మూవీకి రూ. 40 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 60 కోట్లు గ్రాస్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 29 రోజుల్లో ఈ సినిమా రూ. 100.50 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 40.50 కోట్లు లాభాలను అందుకుంది.


Click it and Unblock the Notifications











