Article 370 Movie 3 Days Collections: చిన్న మూవీకి భారీ వసూళ్లు.. 3 రోజుల్లోనే అన్ని కోట్లతో ఊచకోత

ఇండియా వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ సున్నితమైన లేదా వివాదాస్పద కథాంశాలతో సినిమాలు తెరకెక్కుతోన్నాయి. గతంలో కంటే ఈ మధ్య కాలంలో వీటి సంఖ్య భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఫలితంగా అన్ని భాషల్లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ఇలా ఇప్పుడు బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమానే 'ఆర్టికల్ 370' (Article 370). దేశంలోనే అత్యంత ముఖ్యమైన ఓ ఆర్టికల్ రద్దుకు ముందు జరిగిన మిషన్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీనికి మంచి టాక్ రావడంతో వసూళ్లు పోటెత్తుతున్నాయి. మరి 'ఆర్టికల్ 370' మూవీ మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!

ఆ స్టోరీతో ఆర్టికల్ 370 మూవీ:యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో ఆదిత్య సుహాస్ జంభలే తెరకెక్కించిన సినిమానే 'ఆర్టికల్ 370'. జియో స్టూడియోస్, బీబీ6 స్టూడియోస్ బ్యానర్లపై జ్యోతి దేశ్‌పాండే, ఆదిత్య ధర్, లోకేష్ నిర్మించారు. షశ్‌వత్ సచ్‌దేవ్ ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో ప్రియమణి, అరుణ్ గోవలీ, వైభవ్, కిరణ్ కర్మాకర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.

Yami Gautam Starrer Article 370 Movie 3 Days Worldwide Box Office Collections

ఆర్టికల్ 370 మూవీ బిజినెస్:సీక్రెట్ మిషన్ ఆధారంగా తెరకెక్కిన 'ఆర్టికల్ 370' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో హైప్ ఏర్పడింది. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ మూవీకి దాదాపు రూ. 40 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 2000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేసుకున్నారు.

3వ రోజు ఎంత వచ్చిందంటే:ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వంలో రూపొందిన 'ఆర్టికల్ 370' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాకు ఓపెనింగ్స్ డీసెంట్‌గా లభించాయి. అయితే, రెండో రోజు మాత్రం రెస్పాన్స్ పెరిగింది. మూడో రోజు కూడా మరింత స్పందన వచ్చింది. ఫలితంగా ఆదివారం ఈ మూవీకి రూ. 9.60 కోట్లు నెట్‌, రూ. 16 కోట్లు గ్రాస్ వచ్చింది.

Yami Gautam Starrer Article 370 Movie 3 Days Worldwide Box Office Collections

మూడు రోజులకూ కలిపి ఇలా:యామీ గౌతమ్ నటించిన 'ఆర్టికల్ 370' మూవీకి మూడు రోజుల్లో భారీ స్పందన వస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా ఒక రోజుకు మించి మరో రోజు ఈ సినిమా రెస్పాన్స్‌ను అందుకుంటూ సత్తా చాటింది. ఇలా మూడు రోజుల్లోనే ఈ విభిన్నమైన చిత్రం రూ. 22.90 కోట్లు నెట్‌ను వసూలు చేసింది. అలాగే, రూ. 33.80 కోట్లు గ్రాస్‌ కలెక్షన్లను సైతం రాబట్టి సంచలనం సృష్టించింది.

వరల్డ్ వైడ్‌గా ఎంత వచ్చింది:క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'ఆర్టికల్ 370' మూవీకి ఇండియా మొత్తంలో మూడు రోజుల్లో రూ. 26.80 కోట్లు గ్రాస్ వసూలు అయింది. అయితే వరల్డ్ వైడ్‌గా ఇది తక్కువ థియేటర్లలోనే రావడంతో ఓవర్సీస్‌లో కేవలం రూ. 7 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇలా మూడు రోజుల్లో 'ఆర్టికల్ 370' సినిమా 33.80 కోట్లు గ్రాస్‌ను వరల్డ్ వైడ్‌గా రాబట్టింది.

Yami Gautam Starrer Article 370 Movie 3 Days Worldwide Box Office Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:విభిన్నమైన సబ్జెక్టుతో రూపొందిన 'ఆర్టికల్ 370' మూవీకి రూ. 40 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 60 కోట్లు గ్రాస్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 3 రోజుల్లో ఈ సినిమా రూ. 33.80 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ. 26.20 కోట్లు నెట్‌ను ఇది వసూలు చేస్తే హిట్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X