twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు రాష్ట్రాల్లో మరింత పెరిగిన KGF డిమాండ్... మన అగ్ర హీరోల సినిమాలకు మించి..

    |

    తెలుగులో డబ్బింగ్ సినిమాలకు ఉండే వాల్యూ ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. పాన్ ఇండియా అంటే చాలు బాక్సాఫీస్ వద్ద లోకల్ సినిమాల కంటే హై రేంజ్ లో 100కోట్ల వసూళ్లను అందుకుంటున్నాయి. ఇక నెక్స్ట్ అందరిచూపు KGF 2 పైనే ఉంది. ఆ సినిమాను తెలుగులో ఎవరు రిలీజ్ చేస్తారో గాని ఊహలకు అందని ధరకు రిలీజ్ రైట్స్ ను దక్కించుకోవాల్సిందే. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో డీల్స్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.

    Recommended Video

    Yash Fans Writes Pm Modi To Declare National Holiday On KGF 2 Release
    నెగిటివ్ రివ్యూలు వచ్చినా..

    నెగిటివ్ రివ్యూలు వచ్చినా..

    ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన KGF చాప్టర్ 1లో యష్ హీరోయిజం ఆడియెన్స్ కు బాగా ఎక్కేసింది. ఆ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. యష్ నటించిన ఈ సినిమాపై మొదట్లో పెద్దగా అంచనాలు లేవు. ఇక తెలుగులో నెగిటివ్ రివ్యూలు వచ్చినా కలెక్షన్స్ తక్కువేమి రాలేదు. వారాహి చలన చిత్రం నిర్మాతలు తెలుగు హక్కులను 5కోట్లకు అందుకొని 12కోట్లకుపై లాభాలను అందుకున్నారు.

    KGF 2 టీజర్ న్యూ రికార్డ్

    KGF 2 టీజర్ న్యూ రికార్డ్

    బాక్సాఫీస్ వద్ద KGF చాప్టర్ 1 మొత్తానికి బాగానే క్లిక్కయ్యింది. అయితే ఆ తరువాత సినిమా అమెజాన్ ప్రైమ్ లో భారీ స్థాయిలో క్రేజ్ ను అందునుంది. అత్యదిక వ్యూవ్స్ అందుకున్న టాప్ సినిమాల్లో KGF చాప్టర్ 1 నిలవడంతో ఇప్పుడు ఆ ప్రభావం చాప్టర్ 2 మార్కెట్ కు కలిసొచ్చింది. పైగా ఇటీవల విడుదలైన టీజర్ కు అత్యదిక వ్యూవ్స్ రాగా అందులో తెలుగు తెలుగు ఆడియెన్స్ నుంచి కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

    ఆ ఏరియాలో 18కోట్లు..

    ఆ ఏరియాలో 18కోట్లు..

    ఇక KGF చాప్టర్ 2 మార్కెట్ కూడా ఊహాలకందని రేంజ్ కు వెళ్లేలా ఉంది. అప్పట్లో చాప్టర్ 1 కు మొత్తం 5కోట్ల ధర పలుకగా ఇప్పుడు కేవలం గుంటూరు ఏరియా హక్కుల కోసం 5కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర హక్కులు అయితే 20కోట్ల ధర పలుకుతున్నట్లు సమాచారం. ఆ లెక్కను 18కోట్లకు వరకు సెట్ చేయవచ్చని సమాచారం.

    నైజాం రైట్స్ అయితే..

    నైజాం రైట్స్ అయితే..

    నిర్మాతలు బిజినెస్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న నిర్మాతలు బిజినెస్ డీల్స్ ను కూడా వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. నైజాం రైట్స్ అయితే 40 నుంచి 45కోట్ల వరకు ధర పలుకుతున్నట్లు టాక్. ఇక మొత్తం తెలుగు రైట్స్ విషయానికి వస్తే మొదట 90కోట్ల వరకు దాట వచ్చని టాక్ వచ్చింది. 100కోట్లకు చేరువైన కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

    2.ఓ కంటే హై రేంజ్ లో..

    2.ఓ కంటే హై రేంజ్ లో..

    2పాయింట్ O సినిమాకు 70కోట్ల వరకు బిజినెస్ చేయగా ఆ సినిమా తరువాత KGF 2కు ఆ స్థాయిలో మార్కెట్ ఏర్పడుతోంది. మరి సినిమా ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో చూడాలి. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ ను తెలుగులో భారీ స్థాయిలో ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు.

    English summary
    It is not uncommon for a Kannada film to receive Pan India level for the first time. KGF Cinema has overturned all those ideas at a time when it would be great to have a market of 50 crores. The latest blockbuster product from Chapter 1 has just hit the shelves. Fans are eagerly awaiting the success of the film as never before.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X