KGF 2: 8 Days collections: రాఖీ బాయ్ డౌన్.. తెలుగులో బ్రేక్ ఈవెన్ డౌటే.. షాకింగ్ కలెక్షన్స్?
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన KGF చాప్టర్ వన్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ కథకు కొనసాగింపుగా వచ్చిన కేజిఎఫ్ 2 సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. యష్ హీరోగా నటించిన ఈ సినిమా విజయవంతంగా మొదటి వారం పూర్తి చేసుకుంది. సినిమా ఓపెనింగ్స్ కూడా బాగానే అందుకుంది. కానీ ఇంకా చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఫినిష్ చేయాల్సి ఉంది. మొత్తంగా ఎనిమిది రోజుల్లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..

ప్రీ రిలీజ్ బిజినెస్
KGF చాప్టర్ 2 సినిమా మొత్తం వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కర్ణాటక - సుమారు రూ.100కోట్లు. తెలుగు - రూ.78 కోట్లు, తమిళం - రూ.27 కోట్లు, కేరళ - రూ.10కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ.100 కోట్లు, ఓవర్సీస్ లో రూ.30కోట్లు, మొత్తం వరల్డ్ వైడ్ రూ.345కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో KGF 2 మార్కెట్ లోకి అడుగుపెట్టింది.

8వ రోజు ఏపీ తెలంగాణ కలెక్షన్స్
ఇక తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి బిజినెస్ జరిగింది. ఇక 8వ రోజు ఏపీ తెలంగాణలో వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాం రూ.79 లక్షలు, రూ.సీడెడ్ రూ.20 లక్షలు, ఉత్తరాంధ్ర రూ.14 లక్షలు, ఈస్ట్ రూ.11 లక్షలు, వెస్ట్ రూ.6 లక్షలు, గుంటూరు రూ.8 లక్షలు, కృష్ణ రూ.7 లక్షలు, నెల్లూరు రూ.5 లక్షలు.. మొత్తంగా గురువారం రోజు సినిమా 1.50కోట్ల షేర్, 2.45కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

8 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో..
తెలంగాణ ఏపీలో మొత్తం 8 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ.34.22 కోట్లు. సీడెడ్ లో రూ.9.27 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.6.6కోట్లు, ఈస్ట్ రూ.4.51 కోట్లు,వెస్ట్ రూ.2.79 కోట్లు గుంటూరు రూ.3.66 కోట్లు, కృష్ణ రూ.3.30 కోట్లు, నెల్లూరు రూ.2.20కోట్లు.. టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో 66.01కోట్ల షేర్ రాగా.. 105.05కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్
కర్ణాటక రూ.69.05 కోట్లు. తెలుగు రాష్ట్రాల్లో - రూ.66.01 కోట్లు, తమిళనాడులో - రూ.24 కోట్లు, కేరళ - రూ.19.65 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ.134.75 కోట్లు, ఓవర్సీస్ లో రూ.57.80కోట్లు, మొత్తం వరల్డ్ వైడ్ రూ.372.06 కోట్ల షేర్, 750 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

హిట్ అవ్వాలి అంటే..
ఇక బిజినెస్ ను సినిమా కొన్ని రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ను దాటేసింది. మరికొన్ని రాష్ట్రాల్లో ఇంకా టార్గెట్ ఫినిష్ అవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా 78కోట్ల బిజినెస్ చేయగా 8 రోజుల్లో 66కోట్ల షేర్ వసూళ్లను మాత్రమే సాధించింది. కాబట్టి ఇంకా 12.99కోట్ల వసూళ్లను సాధించాల్సిన అవసరం ఉంది.


Click it and Unblock the Notifications











