twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    100 కోట్లు కొల్లగొట్టిన కేజీఎఫ్.. బంగారు గనుల కథతో కనకవర్షం.. డ్రైవర్ కొడుకు రికార్డులు బ్రేక్!

    |

    ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ చిత్రం వసూళ్ల విజయఢంకా మోగిస్తున్నది.భారీ మాఫియా బ్యాక్‌డ్రాప్‌, కోలార్ బంగారు గ‌నుల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం మాస్‌, క్లాస్ అనే తేడా లేకుండా మైమ‌రిపిస్తోంది. విడుదలైన ప్రతీచోట, పలు ప్రాంతాల్లో సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నది. ఈ చిత్రం 5 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. కన్నడ సూపర్ స్టార్ యష్ నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్నది. ప్రాంతాల వారీగా కలెక్షన్లు ఇలా ఉన్నాయి..

    ఓవర్సీస్ మార్కెట్‌లో రికార్డు

    ఓవర్సీస్ మార్కెట్‌లో రికార్డు

    ఓవర్సీస్ మార్కెట్‌లో కేజీఎఫ్ చిత్రం సరికొత్త రికార్డును సొంతం చేసుకొన్నది. అమెరికాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన కన్నడ చిత్రంగా రికార్డు బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు ఈ చిత్రం 413,214 డాలర్లు వసూలు చేసింది. తాజా రిపోర్టుల ప్రకారం ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది అని పలువురు ట్రేడ్ అనలిస్టులు ట్వీట్ చేశారు.

    తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు

    తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు

    తెలుగు రాష్ట్రాల్లో భారీ తెలుగు చిత్రాల రిలీజ్ మధ్య బ్రహ్మండమైన వసూళ్లను సాధించింది. పడి పడి లేచే మనసు, అంతరిక్షం సినిమాలకు ధీటుగా నిలిచింది. గత ఐదు రోజుల్లో ఈ చిత్రం రూ.7.30 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ సినిమా ఆంధ్రాలోనే కాకుండా నైజాంలో కూడా భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా ప్రమోషన్‌ టూర్ చేపట్టగా బుధవారం తిరుపతి, విజయవాడలో మంచి స్పందన కనిపించింది.

    బాక్సాఫీస్ రిపోర్ట్: ‘జీరో'కు ‘కెజిఎఫ్' స్ట్రోక్ ... ఐదో రోజు అమాంతం పెరిగిన కలెక్షన్స్!బాక్సాఫీస్ రిపోర్ట్: ‘జీరో'కు ‘కెజిఎఫ్' స్ట్రోక్ ... ఐదో రోజు అమాంతం పెరిగిన కలెక్షన్స్!

    కర్ణాటకలో రికార్డు వసూళ్లు

    కర్ణాటకలో రికార్డు వసూళ్లు

    కర్ణాటకలో కేజీఎఫ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ కనిపిస్తున్నది. గత ఐదు రోజుల్లో రూ.62 కోట్లు వసూలు చేసింది. ఇక తమిళనాడులో రూ.4.50 కోట్లు రాబట్టింది. కేరళలో ఈ చిత్రం రూ.1.60 కోట్లు వసూలు చేసింది.

    హిందీలో, ఇతర ప్రాంతాల్లో

    హిందీలో, ఇతర ప్రాంతాల్లో

    కేజీఎఫ్ ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా హిందీ ప్రాంతాల్లో బ్రహ్మండమైన కలెక్షన్లను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. హిందీతోపాటు ఇతర ప్రాంతాల్లో ఈ చిత్రం రూ.22 కోట్లు వసూలు చేసింది. హిందీ వెర్షన్‌లో శుక్రవారం రూ.2.10 కోట్లు, శనివారం 3 కోట్లు, ఆదివారం రూ.4.10 కోట్లు, సోమవారం రూ.2.90 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఈ చిత్రం హిందీలో రూ.12.10 కోట్లు రాబట్టింది అని ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

    ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా

    ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా

    దక్షిణాదిలో గీత గోవిందం, కేజిఎఫ్ చిత్రాలు ఈ ఏడాదిలో 100 కోట్ల క్ల‌బ్ చేరడం ఆసక్తికరంగా మారింది. అస‌లు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేని హీరోల్ని ప్రేక్షకులను అంద‌లం ఎక్కించిన సినిమాలుగా ఈ రెండు నిలిచాయ‌న్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఒక డ్రైవ‌ర్ కొడుకు అయిన య‌శ్ 100 కోట్ల క్ల‌బ్ సినిమాని అందించ‌డం ఓ సెన్సేష‌న్ అని పలువురు ప్ర‌శంసించారు.

    English summary
    KGF: Chapter 1, starring Yash has become the highest grosser in US for a Kannada film with nearly $ 400 K gross. This news is confirmed by trade analyst Kaushik. KGF is directed by Prashanth Neel. Srinidhi Shetty is playing the female lead. The period action film, which is the first Kannada film to have been dubbed in Tamil, Telugu, Malayalam and Hindi languages, is produced by Vijay Kiragandur
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X