KGF Chapter 2 day 1 Hindi Colletions హిందీ వెర్షన్ ఆల్‌టైమ్ రికార్డ్.. యష్ బాక్సాఫీస్ మాన్‌స్టర్ అంటూ ప్రశంసలు
రాకింగ్ స్టార్ యష్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన KGF Chapter 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నది. దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలో కూడా భారీ వసూళ్లను నమోదు చేస్తూ ట్రేడ్ వర్గాలను షాక్ గురిచేస్తున్నది. ప్యాన్ ఇండియా మూవీగా రిలీజైన KGF Chapter 2 చిత్రం హిందీ మార్కెట్‌లో బాక్సాఫీస్ హిస్టరీని క్రియేట్ చేసింది. హిందీలో మార్కెట్‌లో KGF Chapter 2 సృష్టిస్తున్న రికార్డులు, తొలి రోజు వసూళ్ల వివరాల్లోకి వెళితే..

రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్
KGF Chapter 2 చిత్రం కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచచింది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ స్థాయిలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. తొలి ఆట తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో అడ్వాన్స్ బుకింగ్ జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది.

హిందీ మార్కెట్‌లో నంబర్‌వన్‌గా
KGF Chapter 2 చిత్రం భారీ అంచనాలతో ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియాలో ప్రతీ రాష్ట్రంలో ఈ సినిమా నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన డిమాండ్ రావడంతో పలు రాష్ట్రాల్లో అర్ధరాత్రి 12 గంటల నుంచి 7 గంటల వరకు ప్రత్యేక షోలు ప్రదర్శించారు. హిందీ వెర్షన్‌కు ఊహించని రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ లెక్కలు మారిపోయే అవకాశం ఉంది.

బీస్ట్ మూవీని తీసేసి కేజీఎఫ్2
KGF Chapter 2 తోపాటు హిందీ మార్కెట్‌లో రిలీజైన బీస్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోతున్నది. తొలి రోజున విజయ్ నటించిన చిత్రం కేవలం 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. ప్రేక్షకుల డిమాండ్ మేరకు పలు చోట్ల బీస్ట్ సినిమాను తీసేసి కేజీఎఫ్ 2 చిత్రాన్ని వేయడం బట్టి ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో స్పష్టమవుతున్నది.

అంచనాలు మించిన కేజీఎఫ్ చాప్టర్ 2
KGF Chapter 2 చిత్రం తొలి రోజున 50 నుంచి 52 కోట్ల వసూలు చేయడానికి అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశారు. కానీ అంచనాలు మించి కలెక్షన్లను రాబట్టడం కనిపించింది. హిందీ మార్కెట్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా KGF Chapter 2 ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. వారాంతంలో కూడా భారీ వసూళ్లను నమోదు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Recommended Video


తొలి రోజు హిందీ కలెక్షన్లు ఎంతంటే?
KGF Chapter 2 గురించి హిందీ మార్కెట్ నిపుణులు సోషల్ మీడియాలో గొప్పగా ప్రస్తావిస్తున్నారు. ఈ సినిమాతో యష్ బాక్సాఫీస్ మాన్‌స్టర్‌గా నిలిచాడు. హిందీలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొన్నాడు. తొలి రోజే హిందీ వెర్షన్ 54 కోట్లు వసూలు చేసింది. హిందీ మార్కెట్‌లో ఇది ఆల్‌టైమ్ రికార్డు అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Click it and Unblock the Notifications











