For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేజీఎఫ్ రికార్డుల పరంపర.. బాక్సాఫీస్‌ను ఇరగదీస్తున్న యష్.. 150 కోట్లపై చూపు!

    |

    రాకింగ్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్నది. కర్ణాటకలో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్నది. శాండల్‌వుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఓ రికార్డు నమోదు చేసింది. యష్, శ్రీనిధి జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రం డిసెంబర్ 21 రిలీజైన సంగతి తెలిసిందే. ఈ చిత్ర 8 రోజులు కలెక్షన్లు ఇలా ఉన్నాయి.. వసూళ్ల వివరాలు ఇవే...

    కర్ణాటకలో భారీగా స్క్రీన్లు

    కర్ణాటకలో భారీగా స్క్రీన్లు

    కర్ణాటకలో కేజీఎఫ్ చిత్రం 350 స్క్రీన్లలో రిలీజైంది. కొత్త సినిమాలు రిలీజైనప్పటికీ కేజీఎఫ్ స్క్రీన్ల తగ్గకపోవడం ఆ సినిమాకు ఉన్న ఆదరణ తెలియజెప్పింది. తొలి రోజుల్లోనే కేజీఎఫ్ చిత్రం రికార్డు వసూళ్లను రాబట్టింది. గత నాలుగు రోజుల్లో కలెక్షన్లు ఏ మాత్రం తగ్గకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

    కర్ణాటకలో రికార్డు కలెక్షన్లు

    కర్ణాటకలో రికార్డు కలెక్షన్లు

    శాండల్‌వుడ్‌లో కేజీఎఫ్ చిత్రం సుమారు రూ.30 కోట్లు వసూలు చేసింది. గతంలో యష్ నటించిన సంతు స్ట్రెయిట్ ఫార్వర్డ్ చిత్రం వసూలు చేసింది రూ.12.5 కోట్లు మాత్రమే. ఈ చిత్రం దానికి రెండితలకుపైగా వసూలు చేయడం యష్ క్రేజ్ తెలియజెప్పింది.

    తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు

    తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు

    ఇక తెలుగు రాష్ట్రాల్లో కేజీఎఫ్ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం ఇప్పటి వరకు తొలివారం షేర్ రూ. 5 కోట్లకుపైగా, గ్రాస్ రూ.9.6 కోట్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నైజాంలో రూ.2 కోట్లు, సీడెడ్‌లో కోటి రూపాయాలు, ఉత్తరాంధ్రలో 60 లక్షలు, గుంటూరు రూ.40 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.27 కోట్లు, పశ్చిమ గోదావరిలో 22 లక్షలు సాధించింది.

    ఓవర్సీస్‌లో కూడా క్రేజ్

    ఓవర్సీస్‌లో కూడా క్రేజ్

    ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా కేజీఎఫ్ సత్తా చాటుతున్నది. అమెరికాలో 522,848 డాలర్లు వసూలు చేసింది. గల్ఫ్ దేశాల్లో, ఇంకా ఇతర దేశాల్లో కూడా ఈ వారం రిలీజ్ కానున్నది. పాజిటివ్ టాక్‌తో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

     150 కోట్ల వైపు పరుగు

    150 కోట్ల వైపు పరుగు

    తొలి నాలుగు రోజుల్లోనే కేజీఎఫ్ చిత్రం రూ.100 కోట్ల మార్కును సునాయసంగా దాటేసింది. ప్రస్తుతం తొలివారం తర్వాత రూ.150 కోట్ల మార్కు వైపు పరుగులు పెడుతున్నది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    English summary
    Rocking Star Yash's KGF is getting ready to become the biggest hit of all-time in Sandalwood box office. This news is confirmed by trade analyst Kaushik. KGF is directed by Prashanth Neel. Srinidhi Shetty is playing the female lead. The period action film, which is the first Kannada film to have been dubbed in Tamil, Telugu, Malayalam and Hindi languages, is produced by Vijay Kiragandur.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X