Yashoda day 3 Collections యూఎస్‌లో యశోద వసూళ్ల దుమారం.. హాలీవుడ్‌లో చరిత్ర సృష్టించిన సమంత మూవీ!

సరోగసి నేపథ్యంతో క్రైమ్, థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన యశోద చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లను నమోదు చేస్తున్నది. స్టార్ హీరోలకు ధీటుగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం కలెక్షన్లను సాధిస్తున్నది. గత రెండు రోజుల్లో భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రం మూడో రోజు కూడా భారీ వసూళ్లను రాబట్టింది. సమంత కెరీర్‌లోనే బెస్ట్‌గా నిలుస్తూ వసూళ్లను కురిపిస్తున్నది. ఈ సినిమా 3 రోజు ఏ మేరకు కలెక్షన్లను సాధించిందంటే..

మూడో రోజు స్లోగా మొదలై.. సాయంత్రానికి భారీగా

మూడో రోజు స్లోగా మొదలై.. సాయంత్రానికి భారీగా

యశోద చిత్రం మూడో రోజున (ఆదివారం) సెలవు రోజున కూడా భారీ వసూళ్లను సాధించింది. మార్నింగ్ షోలు కొంత స్లోగా స్టార్ట్ అయినప్పటికీ.. మధ్యాహ్నం షో నుంచి ఆక్యుపెన్సీ పెరిగింది. ఈ చిత్రం యావరేజ్‌గా 55 శాతం అక్యుపెన్సీ మూడో రోజున సాధించింది. దాంతో ఆదివారం రికార్డు కలెక్షన్లు సాధించింది.

మూడో రోజు యశోద ఆక్యుపెన్సీ

మూడో రోజు యశోద ఆక్యుపెన్సీ

యశోద సినిమా తెలుగు రాష్ట్రాల్లోను, తెలుగేతర రాష్ట్రాల్లోను భారీగా రెస్సాన్స్ కూడగట్టుకొంటున్నది. హైదరాబాద్‌లో 45 శాతం ఆక్యుపెన్సీ, బెంగళూరులో 40 శాతానికి పైగా, చెన్నైలో 90 శాతం, వరంగల్‌లో 40 శాతం, వైజాగ్‌లో 42 శాతం, కాకినాడలో 98 శాతం, ఇతర ప్రాంతాల్లో 40 శాతం మేరకు వసూళ్లను సాధించింది.

హాలీవుడ్‌లో టాప్ 10 జాబితాలో

హాలీవుడ్‌లో టాప్ 10 జాబితాలో

ఓవర్సీస్‌లో యశోద చిత్రం దుమ్ము రేపుతున్నది. ఈ చిత్రం అమెరికా బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డు నమోదు చేసుకొన్నది. బ్లాక్ పాంథర్ 2 సినిమాతోపాటు ఇటీవల రిలీజైన హాలీవుడ్ సినిమాలకు ధీటుగా యశోద కలెక్షన్ల రాబడుతున్నది. ఈ చిత్రం అమెరికా బాక్సాఫీస్ వద్ద టాప్ 10 కలెక్షన్ల జాబితాలో చేరడం విశేషంగా మారింది.

యూఎస్‌లో గత మూడు రోజుల కలెక్షన్లు

యూఎస్‌లో గత మూడు రోజుల కలెక్షన్లు

అమెరికాలో యశోద కలెక్షన్ల సునామీ కొనసాగుతున్నది. ఆదివారం ఈ చిత్రం 64K డాలర్లను రాబట్టింది. దాంతో గత మూడు రోజుల్లో ఈ చిత్రం 410k డాలర్లకుపైగా అంటే.. 2.38 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. గత రెండు రోజుల్లోనే యశోద చిత్రం అమెరికాలో బ్రేక్ ఈవెన్ సాధించి.. భారీ లాభాలను సాధించే దిశగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నది. ఈ వారాంతంలో ఈ చిత్రం 600K కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో యశోద వసూళ్లు

తెలుగు రాష్ట్రాల్లో యశోద వసూళ్లు

తెలుగు రాష్ట్రాల్లో యశోద చిత్రం తొలి రోజున 1.63 కోట్ల షేర్, 2.7 కోట్ల గ్రాస్ సాధించింది. రెండో రోజున కూడా తొలి రోజు కంటే 34 శాతం వృద్దితో 1.76 కోట్లు షేర్, 3.1 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక మూడో రోజు తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం 3.07 కోట్ల గ్రాస్, 1.75 కోట్ల షేర్ సాధించింది. దాంతో ఈ చిత్రం గత మూడు రోజుల్లో 9 కోట్ల మేర వసూళ్లను సాధించింది.

హిందీ, తమిళంలో పరిస్థితి ఇలా.

హిందీ, తమిళంలో పరిస్థితి ఇలా.


ఇక తెలుగేతర రాష్ట్రాల కలెక్ష విషయానికి వస్తే.. తమిళంలో ఈ చిత్రం తొలి రోజున 25 లక్షలు, రెండో రోజు 4 లక్షలు, మూడో రోజు 45 లక్షలు వసూళ్లు సాధించింది. ఇక హిందీలో తొలి రోజు 10 లక్షలు, రెండో రోజున 14 లక్షలు, మూడో రోజున 15 లక్షలు వసూళ్లు సాధించింది.

ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల కలెక్షన్లు ఎంతంటే?

ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల కలెక్షన్లు ఎంతంటే?

ఇక ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగులో 9 కోట్లకుపైగా, హిందీలో 40 లక్షల షేర్, తమిళంలో 75 లక్షలు వసూలు చేసింది. యశోద చిత్రం ఇండియాలో తొలి రోజున 3.06 కోట్లు, రెండో రోజు 3.64 కోట్లు, మూడో రోజు 3.67 కోట్ల వసూళ్లను సాధించింది. ఓవర్సీస్‌తో కలుపుకొంటే.. దాదాపు 14 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ సినిమాను నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ సొంతంగా రిలీజ్ చేయడం వల్ల బ్రేక్ ఈవెన్ వివరాలు అందుబాటులో లేవు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X