Yashoda day 4 Collections ఓవర్సీస్‌లో కలెక్షన్ల కుమ్ముడు.. సమంత మూవీకి ఏ రేంజ్ లాభాలంటే?
సౌత్ స్టార్ సమంత నటించిన యశోద చిత్రం కలెక్షన్ల ప్రవాహం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. దేశంలోనే కాకుండా విదేశాల్లో భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా ఇప్పటికే అన్ని భాషల్లో లాభాలను నమోదు చేస్తున్నది. ఇక ఈ సినిమా సాధించిన 5వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

గత మూడు రోజుల్లో
యశోద చిత్రానికి సంబంధించిన అన్ని భాషల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు రూ.3.06 కోట్లు, రెండో రోజు 3.64 కోట్లు, మూడో రోజు 3.58 కోట్లు వసూలు చేసింది. దాదాపు మూడు రోజుల్లో 11 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లను సాధించింది.

నాలుగో రోజు ఆక్యుపెన్సీ ఎంతంటే?
ఇక నాలుగో రోజు విషయానికి వస్తే.. కీలకమైన తొలి సోమవారం నిలకడగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు సంబంధించి అన్ని ప్రాంతాల్లో సుమారుగా 45 శాతం అక్యుపెన్సీ నమోదైంది. హిందీ వెర్షన్ విషయానికి వస్తే.. 20 శాతం అక్యుపెన్సీ, తమిళ, మలయాళం విషయానికి వస్తే.. 20 శాతం ఆక్యుపెన్సీ నమోదయ్యాయి.

ఓవర్సీస్‌లో కలెక్షన్ల కుమ్ముడు
యశోద సినిమా ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే. ఓవర్సీస్‌లో ఇప్పటికే 4 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. అమెరికాలో ఇప్పటి వరకు 445K డాలర్లు అంటే.. 3.43 కోట్లు, ఆస్ట్రేలియాాలో 53590 ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే 29 లక్షలు వసూలు చేసింది. ఓవర్సీస్ డిస్టిబ్యూటర్లకు ఈ సినిమా భారీ లాభాలను పంచిపెట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజు
యశోద సినిమా తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 1.63 కోట్లు, రెండో రోజు 1.76 కోట్లు, మూడో రోజు 1.58 కోట్లు సాధించింది. ఇక నాలుగో రోజు 69 లక్షలు సాధించింది. దాంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 5.66 కోట్ల షేర్, 10 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.

4వ రోజున నైజాం, ఆంధ్రాలో
నైజాం, ఆంధ్రాలో యశోద 4వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 38 లక్షలు, సీడెడ్‌లో 5 లక్షలు, ఉత్తరాంధ్రలో 7 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 4 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 లక్షలు, గుంటూరులో 5 లక్షలు, నెల్లూరు జిల్లాలో 2 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 69 లక్షల షేర్, 1.2 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

యశోద 4వ రోజు ప్రపంచవ్యాప్తంగా
ఇక యశోద సినిమా ప్రపంచవ్యాప్తంగా నమోదు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో 5.66 కోట్లు, 10 కోట్ల గ్రాస్, తమిళనాడులో 72 లక్షలు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 85 లక్షలు, ఓవర్సీస్‌లో 4కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 14 కోట్లకుపైగా షేర్, 21 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.


Click it and Unblock the Notifications











