Yashoda day 5 Collections అమెరికాలో యశోద రేర్ ఫీట్.. నిలకడగా సమంత మూవీ కలెక్షన్లు!

శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణ సారథ్యంలో సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నటించిన చిత్రం యశోద. నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లకుపైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను సాధిస్తున్నది. యశోద చిత్రం 5వ రోజున ఎంత వసూలు చేసిందంటే?

 5వ రోజు యశోద పరిస్థితి

5వ రోజు యశోద పరిస్థితి

యశోద చిత్రం 5వ రోజున దేశవ్యాప్తంగా 464 పట్టణాల్లో 1052 సినిమా హాళ్లలో ప్రదర్శించారు. తెలుగులో 77 వేలకుపైగా ప్రదర్శనలు, హిందీలో 13 వేలు, తమిళంలో 11 వేలు, మలయాళంలో 502 స్క్రీన్లలో ప్రదర్శించారు. తొమ్మిది చోట్ల హౌస్‌ఫుల్స్ కాగా, మిగితా చోట్ల సగటున 20 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది.

మలేషియాలో స్క్రీన్ల పెంపు

మలేషియాలో స్క్రీన్ల పెంపు

యశోద చిత్రం యూఎస్, మలేషియా ఇతర దేశాల్లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నది. మలేషియాలో ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. పబ్లిక్ డిమాండ్ మేరకు ఈ సినిమా స్క్రీన్లను మంగళవారం పెంచారు. తమిళంలో విజయవంతమైన లవ్ టుడే సినిమాకు ధీటుగా వసూళ్లను సాధిస్తున్నది.

హాఫవ్ మిలియన్ డాలర్ల క్లబ్‌లో యశోద

హాఫవ్ మిలియన్ డాలర్ల క్లబ్‌లో యశోద

ఇక యశోద చిత్రం అమెరికాలో నిలకడగా, బంపర్‌గా కలెక్షన్లను రాబడుతున్నది. ఈ సినిమా గత ఐరు రోజుల్లో 500k వసూళ్లను నమోదు చేసింది. మంగళవారం ఈ చిత్రం ఈ ఫీట్‌ సాధించింది. 165 లోకేషన్లలో యశోద చిత్రం $41,053 రాబట్టింది. దాంతో ఈ చిత్రం 500K క్లబ్‌లో చేరింది. రానున్న రోజుల్లో 1 మిలియన్ క్లబ్‌లో చేరేందుకు పరుగులు పెడుతున్నది.

మిలియన్ డాలర్ల క్లబ్‌లో

మిలియన్ డాలర్ల క్లబ్‌లో

ఓవర్సీస్‌లో సమంత నటించిన యశోద చిత్రం భారీ కలెక్షన్లను నమోదు చేస్తున్నది. గతంలో సామ్ నటించిన ఓ బేబీ సినిమా అమెరికాలో 1 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. యశోద కూడా ఫుల్ రన్‌లో ఒక మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. హాలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను సాధిస్తున్న టాప్ 10 చిత్రాల జాబితాలో నిలిచింది.

5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో..

5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో..

యశోద చిత్రం 5వ రోజున తెలుగు వెర్షన్ 88 లక్షలు, హిందీలో 9 లక్షలు, తమిళంలో 16 లక్షలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం అన్ని భాషల్లో కలుపుకొని దేశవ్యాప్తంగా 1.13 కోట్లు సాధించింది. గత నాలుగు రోజుల్లో 11.6 కోట్లు సాధించిన ఈ చిత్రం ఐదో రోజు కలెక్షన్లను కలుపుకొని మొత్తం 12.76 కోట్లు రాబట్టింది. అమెరికాలో 4 కోట్లకుపైగా ఒక ఓవర్సీస్‌లో కలెక్షన్లను కలుపుకొని మొత్తంగా 17 కోట్ల వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా నమోదు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X