Yashoda day 6 Collections 25 కోట్ల యశోద.. ఓవర్సీస్‌లో హవా.. తెలుగు రాష్ట్రాల్లో డ్రాప్.. కారణం అదే!
సమంత రుత్ ప్రభు నటించిన యశోద చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా కలెక్షన్లను రాబడుతున్నది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. సూపర్ స్టార్ కృష్ణ మరణ విషాదం కారణంగా గత రెండు రోజులుగా బాక్సాఫీస్ కొంత తడబాటుకు గురైంది. అయితే ఓవర్సీస్‌లో స్ట్రాంగ్‌గా కలెక్షన్లను సాధిస్తున్నది. యశోద చిత్రం 6వ రోజున ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందంటే?

తొలి వారంలోనే యశోద బ్రేక్ ఈవెన్
యశోద చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. ట్రేడ్ వర్గాల వాల్యూ ప్రకారం ఈ చిత్రం ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి.. ప్రాఫిట్ జోన్‌లోకి అడుగుపెట్టింది. యశోద చిత్రం ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇంటర్నేషన్ మార్కెట్‌లో బలంగా వసూళ్లను రాబట్టడంతో రెండో వారంలో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అమెరికాలో టాప్ రేపుతున్న సమంత
అమెరికాలో యశోద చిత్రానికి అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. ఈ చిత్రం ప్రీమియర్ల ద్వారా 65,577 డాలర్లు, తొలి రోజున $133,545, రెండో రోజున $144,316, మూడో రోజున $88,083, నాలుగో రోజున $26,845, ఐదో రోజున $45,726, ఆరో రోజున 40000k పైగా వసూళ్లతో యూఎస్‌లో 550000 డాలర్లు అంటే.. 4.4 కోట్ల రూపాయలను నమోదు చేసింది.

ఇండియా వైడ్ కలెక్షన్లు
ఇండియాలో యశోద కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజున 3.06 కోట్లు, రెండో రోజున 3.64 కోట్లు, మూడో రోజున 3.58 కోట్లు, నాలుగో రోజున 1.33 కోట్లు, ఐదో రోజున 89 లక్షలు, ఆరో రోజున 84 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 13.34 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది.

యశోద 6వ రోజు కలెక్షన్లు
యశోద 6వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. తెలుగులో 60 లక్షల రూపాయలు, హిందీలో 9 లక్షల రూపాయలు, తమిళంలో 15 లక్షల రూపాయలు రాబట్టింది. సూపర్ స్టార్ కృష్ణ ఆకస్మిక మరణం కారణంగా యశోద కలెక్షన్లు డ్రాప్ అయ్యాయనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపించింది. రెండో వారాంతంలో యశోద కలెక్షన్లు పుంచుకొనే అవకాశం ఉందనే అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఎంతంటే?
ప్రపంచవ్యాప్తంగా యశోద చిత్రం సాలిడ్‌గా, స్ట్రాంగ్‌గా వసూళ్లను నమోదు చేస్తూ భారీ విజయాన్ని నమోదు చేస్తున్నది. ఇంటర్నేషనల్ మార్కెట్ విషయానికి వస్తే.. మలేషియాలో స్క్రీన్ల కౌంట్ పెరుగుతున్నది. అమెరికాలో 550k వసూళు సాధించింది. దేశవ్యాప్తంగా 13.34 కోట్ల షేర్, 20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల గ్రాస్‌తో ముందుకెళ్తున్నది.


Click it and Unblock the Notifications











