twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Yashoda Closing Collections బాక్సాఫీస్ వద్ద సమంత ధమాకా.. వరల్డ్‌వైడ్ ఎన్ని కోట్ల లాభమంటే?

    |

    ఆదిత్య 369, జెంటిల్మన్, సమ్మోహనం లాంటి చిత్రాలను రూపొందించిన ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన చిత్రం యశోద. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నటించిన ఈ చిత్రానికి హరీ, హరీష్ దర్వకత్వం వహించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందించిన ఈ చిత్రం నవంబర్ 5వ తేదీన రిలీజై భారీ ఒపెనింగ్స్‌ను సాధించింది. ఇటీవల కాలంలో సూపర్ హిట్ అందుకొన్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా టోటల్ కలెక్షన్లు ఎంతంటే?

    యశోద ప్రీ రిలీజ్ బిజినెస్

    యశోద ప్రీ రిలీజ్ బిజినెస్

    యశోద సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ సొంతంగా రిలీజ్ చేసుకొన్నారు. ఏపీ, నైజాంలో కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే.. దేశవ్యాప్తంగా ఈ సినిమాను ఓన్ రిలీజ్ చేశారు. . 12 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని ట్రేడ్ వర్గాలు నిర్ణయించాయి. నైజాం హక్కులు 4 కోట్లు, సీడెడ్ 1.2 కోట్లు, ఆంధ్రాలో 5 కోట్లు, ఓవర్సీస్ 1.75 కోట్లు, మిగితా ప్రాంతాల్లో 1.3 కోట్లుగా విలువ కట్టారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 11.5 కోట్లుగా అంచనా వేశారు.

    తొలి రోజు నుంచే హిట్ టాక్‌తో

    తొలి రోజు నుంచే హిట్ టాక్‌తో

    యశోద చిత్రం తొలి రోజు నుంచే హిట్ టాక్‌తో దూసుకెళ్లింది. సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్ ఫెర్ఫార్మెన్స్‌కు మంచి ప్రశంసలు లభించాయి. దర్శకులు హరి, హరీష్ కథ, కథనాలు అన్ని వర్గాలను ఆకట్టుకొన్నాయి. ఇక ఈ సినిమా కోసం సెట్లు, కథకు తగినట్టుగా శ్రీదేవీ మూవీస్ నిర్మాణ విలువలు పాటించింది.

    తెలుగు రాష్ట్రాల్లో ఎంత లాభమంటే?

    తెలుగు రాష్ట్రాల్లో ఎంత లాభమంటే?

    తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 4.55 కోట్లు, సీడెడ్‌లో 95 లక్షలు, ఉత్తరాంధ్రలో 1.36 కోట్ల షేర్ సాధించింది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో 56 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 34 లక్షలు, గుంటూరులో 60 లక్షలు, కృష్ణా జిల్లాలో 65 లక్షలు, నెల్లూరు జిల్లాలో 29 లక్షల షేర్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 9.30 కోట్లు షేర్, 16.60 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

    తెలుగేతర రాష్రాల్లో వసూళ్లు

    తెలుగేతర రాష్రాల్లో వసూళ్లు

    ఇక యశోద మూవీకి సంబంధించి తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. తమిళంలో 1.35 కోట్లు, కర్ణాటక, మిగితా రాష్ట్రాల్లో 1.35 కోట్లు, ఓవర్సీస్‌లో 2.5 కోట్ల మేర వసూళ్లను సాధించింది. హిందీలో 2 కోట్ల మేర వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 14.85 కోట్లు, 32.15 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

    ప్రపంచవ్యాప్తంగా ఎంత లాభమంటే?

    ప్రపంచవ్యాప్తంగా ఎంత లాభమంటే?


    యశోద చిత్రం 12 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. సమంత కెరీర్‌లో వచ్చిన.. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లను సాధించింది. దాదాపు 3 కోట్ల మేర లాభాలను పంచిపెట్టింది. 2022 సంవత్సరంలో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రంగా యశోద నిలిచింది.

    English summary
    Samantha Ruth Prabhu's Yashoda Theatrical run completed with Successful. This movie made around 40 crores budget. This movie collectied 32.12 crores gross. Here is the full breakup box offcie report areawise.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X