Yashoda day 1 Collections సమంత క్రేజ్ మామూలుగా లేదుగా. అగ్ర హీరోలకు ధీటుగా కలెక్షన్లు.. తొలి రోజు ఎంతంటే?
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నటించిన యశోద చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను సాధిస్తున్నది. ఫీల్‌గుడ్ పాయింట్‌తో సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలను జోడించి తెరకెక్కించిన హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రానికి తొలి ఆట నుంచే మంచి స్పందన లభిస్తున్నది. దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో రూపొందిన ఈ చిత్రం తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే?

భారీగా అడ్వాన్స్ బుకింగ్
సర్రోగసి నేపథ్యంగా యాక్షన్ థ్రిల్లర్‌గా యశోద సినిమా నవంబర్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. టీజర్లు, ట్రైలర్లకు భారీ స్పందన రావడంతో తొలి రోజు భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసుకొన్నది. ఇండియాలో 55 వేల టికెట్ల అమ్మకాలు జరగగా, 1 కోటికిపైగా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో కలెక్షన్ల రాబట్టింది.

యశోద మూవీ తొలి రోజు ఆక్యుపెన్సీ
యశోద సినిమా ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. తెలుగు వెర్షన్‌లో యావరేజ్‌కు మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. హైదరాబాద్‌లో 34 శాతం, విజయవాడలో 21 శాతం, గుంటూరులో 30 శాతం, వరంగల్‌లో 30 శాతం, కాకినాడలో 94 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. చెన్నై 69 శాతం, బెంగళూరు లో 26 శాతం అక్యుపెన్సీ కనిపించింది.

స్టార్ హీరోల కంటే భారీగా
తెలుగులో ఇటీవల రిలీజైన స్టార్ హీరోలు తొలి రోజు సాధించిన వసూళ్లతో సమంత పోటీ పడుతున్నది. హైదరాబాద్‌లో థ్యాంక్యూ సినిమా 63 లక్షలు, బింబిసార 58 లక్షలు, ది ఘోస్ట్ 49 లక్షలు సాధించగా.. 65 లక్షలు వసూలు చేసింది. దాంతో యశోద సినిమాపై ఉన్న క్రేజ్ ఏంటో రుజువైంది.

అమెరికాలో వసూళ్లు క్రేజీగా
అమెరికాలో యశోద చిత్రానికి మంచి క్రేజ్ లభించింది. ప్రీమియర్స్ రూపంలో 60k డాలర్లు నమోదు చేసింది. అయితే తొలి రోజు కంటే రెండో రోజు ఈ సినిమా స్క్రీన్ కౌంట్ భారీగా పెరిగింది. తొలి రోజున ఈ చిత్రం 200K డాలర్లను అంటే.. 1.60 కోట్లకుపైగా నమోదు చేసింది. ప్రీమియర్ల రూపంలో 60k, తొలి రోజు 134886 డాలర్లు వసూలు చేసింది.

తెలుగులో యశోద తొలి రోజు కలెక్షన్లు
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. యశోద చిత్రానికి మంచి రెస్సాన్స్ లభిస్తున్నది. ఇటీవల కాలంలో వచ్చిన భారీ సినిమాలకు మించి తొలి రోజు కలెక్షన్లను రాబడుతున్నది. హైదరాబాద్‌లో తొలి రోజు 64 లక్షల రూపాయలను వసూలు చేసింది. ఆంధ్రాలో భీమవరం 2 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. వైజాగ్‌లో 4 లక్షల గ్రాస్‌ను నమోదు చేసింది.

దేశవ్యాప్తంగా వసూళ్లు..
ఇక దేశవ్యాప్తంగా వివిధ భాషల కలెక్షన్ల విషయానికి వస్తే. యశోద సినిమా తెలుగులో 3 కోట్లు, హిందీలో 10 లక్షలు, తమిళంలో 10 లక్షలు, మలయాళంలో 10 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 3.25 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో 80 లక్షలు కలుపుకొంటే.. ఈ చిత్రం మొత్తంగా 4 కోట్ల వసూళ్లను రాబట్టింది.

యశోద లాభాల్లోకి రావాలంటే..
యశోద సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. తెలుగు, ఇతర భాషల మొత్తం బిజినెస్ 12 కోట్లుగా నమోదైంది. ఓవర్సీస్ 2.5 కోట్లు, హిందీ థియేట్రికల్ రైట్స్ 3.5 కోట్లకు అమ్ముడయ్యాయి. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 18.5 కోట్లు రాబట్టాల్సి ఉంది. తొలి రోజు 4 కోట్లకపైగా వసూళ్లను రాబట్టడంతో ఈ సినిమా ఇంకా 14 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications











