‘యాత్ర’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉందంటే..?
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా మహి వి రాఘవ్ దర్శకత్వంలో తరకెక్కిన 'యాత్ర' ఫిబ్రవరి 8న విడుదలై బాక్సాఫీసు వద్ద సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకోవడంతో వసూళ్లు క్రమ క్రమంగా పుంజుకుంటున్నాయి.
ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టడానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ చేసిన పాదయాత్రలోని ముఖ్య ఘట్టాలను పోకస్ చేస్తూ 'యాత్ర' చిత్రం తెరకెక్కింది. ఆయన అధికారం చేపట్టిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాలు వైఎస్ఆర్‌ను మహానేతను చేశాయి.

2 డేస్ కలెక్షన్
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలి రెండు రోజుల్లో రూ. 3.62 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నైజాం. సీడెడ్ ఏరియాల్లో వసూళ్లు అదరగొడుతోంది.

ఏరియా వైజ్ కలెక్షన్స్
నైజాం: రూ. 1.13 కోట్లు, సీడెడ్ రూ. 68 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 24 లక్షలు, గుంటూరు రూ. 64 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 15 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 26 లక్షలు, కృష్ణ రూ. 29 లక్షలు, నెల్లూరు రూ. 23 లక్షలు వసూలు చేసింది.

వైఎస్ఆర్ పాత్రకు జీవం పోసిన మమ్ముట్టి
‘యాత్ర'లో వైఎస్ఆర్ పాత్రను ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి పోషించారు. ఆయనే స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పుకోవడం గమనార్హం. మమ్ముట్టి.. వైఎస్ఆర్ పాత్రకు జీవం పోశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

యూఎస్ఏలో
అయితే యూఎస్ఏలో కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. తొలి రెండు రోజుల్లో ప్రీమియర్ షోలతో కలిపి దాదాపు లక్షన్నర డాలర్లు వసూలైనట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











