Yatra 2 Collections యాత్ర 2 కు భారీ ఓపెనింగ్స్.. వైఎస్ జగన్ బయోపిక్‌కు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
దక్షిణాది స్టార్ హీరోలు మమ్ముట్టి, జీవా, మరాఠీ నటి కేతకి నారాయణ్, సచిన్ ఖేడ్కర్, మహేష్ మంజ్రేకర్ నటించిన చిత్రం యాత్ర 2. ఏపీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు మహీ వీ రాఘవ దర్శకత్వం వహించారు. పోలిటికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు మేక శివ నిర్మాతగా వహించారు. ఫిబ్రవరి 8వ తేదీన రిలీజైన ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్‌గా రూపొందిన యాత్ర 2 చిత్రంలో నటించిన ఆర్టిస్టుల రెమ్యునరేషన్ల, ప్రొడక్షన్ కాస్ట్‌తో కలిపి ఈ మూవీని 40 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక ఈ మూవీ ప్రమోషనల్ ఖర్చులు, ఇతర వ్యయాలతో కలిపి మొత్తంగా 50 కోట్ల రూపాయల బడ్జెట్ అని లెక్క తేల్చారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

యాత్ర 2 సినిమాకు సంబంధించి పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించలేదు. అయితే ఈ సినిమా పొలిటికల్ మూవీ కావడంతో బయ్యర్లు కూడా ఆసక్తి చూపకపోవడంతో ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఓవర్సీస్‌లో సుమారుగా 88 లొకేషన్లలో రిలీజ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
యాత్ర 2 సినిమా ఆక్యుపెన్సీ పర్వాలేదనిపించింది. మార్నింగ్ షోలకు 45 శాతం, మ్యాట్నీకి 30 శాతం ఫస్ట్ షోకు 30 శాతం, సెకండ్ షోకు 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. అయితే ఊహించినంతగా ఆక్యుపెన్సీ నమోదు కాలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఓవర్సీస్‌లో అంటే.. ముఖ్యంగా అమెరికాలో యాత్ర 2 సినిమాకు మంచి స్టార్ట్ లభించింది. ప్రీమియర్లకు ఈ సినిమా సుమారుగా 55000 డాలర్లు రాబట్టింది. అంటే భారతీయ కరెన్సీలో 45 లక్షల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. తొలి రోజుతో కలిపి మొత్తంగా 100K డాలర్లు వసూలు చేసే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, యాత్ర 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ జర్నీని మొదలుపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 2.5 కోట్ల షేర్.. 5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. మొత్తంగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











