Yatra 2 Business యాత్ర 2 మూవీకి నో బిజినెస్.. ముఖం చాటేస్తున్న బయర్లు!
యువ దర్శకుడు మహీ వీ రాఘవ డైరెక్షన్‌లో వీ సెల్యూలాయిడ్, థ్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్లపై శివ మేక నిర్మించిన చిత్రం యాత్ర 2. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లనా్ చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ వివరాల్లోకి వెళితే..
యాత్ర 2 సినిమా విషయానికి వస్తే.. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, తమిళ నటుడు జీవా, కేతకి నారాయణ్, సుజానే బెర్నెర్ట్, మహేష్ మంజ్రేకర్, అశ్రిత వేముగంటి నండూరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. మధి సినిమాటోగ్రఫిని అందించారు.

ఇటీవల రిలీజైన యాత్ర 2 సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏపీలో ఎన్నికలు జరగడానికి ముందు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేశారు. లాల్ సలామ్, ఈగిల్, ట్రూ లవర్ లాంటి సినిమాలతో పోటీ పడుతూ రిలీజ్ అవుతున్నది.
ఇక యాత్ర 2 సినిమాలో మమ్ముట్టి, జీవా లాంటి అగ్ర హీరోలు నటించడంతోపాటు భారీగా ఇతన నటీనటులు నటించారు. దాంతో ఈ సినిమా ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, ఇతర ఖర్చులతో కలిపి మొత్తంగా 40 కోట్ల రూపాయల మేర బడ్జెట్ అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉండగా, యాత్ర 2 సినిమాకు సంబంధించి బిజినెస్ ఇంకా పూర్తి కాలేదని ఫిలింనగర్‌లో టాక్ విస్తృతంగా ప్రచారంలో ఉంది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా జరగలేదు. ఇంకా చర్చల దశలోనే ఉంది. ఈ క్రమంలో థియేట్రికల్ పరంగా సొంతంగా రిలీజ్ చేసే ఆలోచనల్లో ఉన్నారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
యాత్ర సినిమా రిలీజ్ సమయంలో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. యాత్ర 2 విషయానికి వస్తే.. విడుదలకు 3 రోజుల ముందుకు కూడా ఎలాంటి బజ్ క్రియేట్ కాలేదు.ప్రమోషన్స్ గురించి పెద్దగా యూనిట్ పట్టించుకోవడం లేదనే మాట వినిపిస్తున్నది. యాత్ర 2 సినిమాను లో ప్రొఫైల్‌లో రిలీజ్ చేయడం వెనుక మతలబు ఏమిటనే విషయం ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications











