Yatra 2 Closing Collections వైఎస్ జగన్ బయోపిక్ డిజాస్టర్.. యాత్ర 2 మూవీకి ఎన్ని కోట్ల నష్టమంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన కొన్ని కీలక సంఘటనల ఆధారంగా యువ దర్శకుడు మహీ వీ రాఘవ రూపొందించిన చిత్రం యాత్ర 2. యాత్ర ఘన విజయం సాధించిన నేపథ్యంలో దానికి సీక్వెల్‌గా రూపొందిన మూవీలో మమ్ముట్టి, జీవా తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. బారీ అంచనాలతో ఫిబ్రవరి 9వ తేదీన రిలీజైన ఈ సినిమా తొలివారం థియేట్రికల్ రన్‌ను దాదాపు ముగించింది. ఈ సినిమా బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

వైఎస్ జగన్ బయోపిక్‌గా రూపొందిన యాత్ర 2 సినిమాను ఖర్చుకు వెనుకాడకుండా మంచి క్వాలిటీతో తెరకెక్కించారు. అగ్ర నటుల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషన్స్ ఖర్చులతో సహా ఈ సినిమాను సుమారుగా 60 కోట్లతో రూపొందించారు. అయితే ఈ సినిమా సుమారుగా 40 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

Yatra 2 Telugu movie Closing Box Office Collections Worldwide

స్వర్గీయ వైఎస్ఆర్‌గా మమ్ముట్టి, వైఎస్ జగన్‌గా జీవా నటించిన యాత్ర 2 చిత్రం రిలీజ్‌కు ముందు మంచి బజ్ క్రియేట్ చేసింది. బజ్ తగినట్టుగానే ఈ సినిమా తొలి రోజు పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 800 స్రీన్లలో రిలీజ్ చేయగా.. తెలంగాణ, ఆంధ్రాలో 450 స్రీన్లలో విడుదల చేశారు.

Yatra 2 Telugu movie Closing Box Office Collections Worldwide

యాత్ర 2 సినిమా ఊహించినట్టుగానే తొలి రోజు భారీగా ఓపెనింగ్స్ సాధించింది. ఈ సినిమా ఫస్ట్ డే 2 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. అయితే తొలి రోజు కలెక్షన్లను నిలబెట్టుకోలేకపోయింది. రెండో రోజు 70 లక్షలు, 3వ రోజు 65 లక్షలు, 4వ రోజు 70 లక్షలు, 5వ రోజు 55 లక్షలు, 6వ రోజు 50 లక్షలు, ఏడో రోజు 40 లక్షలు వసూలు చేసింది. ఇక 8వ రోజు 30 లక్షలు నికరంగా సాధించింది. దాంతో ఈ చిత్రం సుమారుగా 6 కోట్ల రూపాయలు ఇండియాలో సాధించింది.

వరల్డ్ వైడ్‌గా యాత్ర 2 సినిమా వసూళ్ల విషయానికి వస్తే.. ఈ మూవీ తెలుగు రాష్ట్రాలు, కన్నడలో కలిపి మొత్తంగా 12 కోట్ల గ్రాస్, 6 కోట్లకుపైగా షేర్ వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 75 లక్షలు షేర్ 1.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.

Yatra 2 Telugu movie Closing Box Office Collections Worldwide

యాత్ర 2 చిత్రం బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కనీసం 40 కోట్ల బాక్సాఫీస్ లక్ష్యంతో రిలీజైంది. కానీ ఈ సినిమా కనీస వసూళ్లు కూడా సాధించలేక చతికిలపడింది. దాదాపు 30 కోట్లకుపైగానే థియేట్రికల్ నష్టంతో బాక్సాఫీస్ యాత్రను ముగించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X