‘యాత్ర’ మూవీ బాక్సాఫీస్ సంచలనం... ‘F2’ తర్వాత పెద్ద హిట్!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'యాత్ర' చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. విజయవంతంగా 2 వారాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2019లో విడుదలైన చిత్రాల్లో 'ఎఫ్ 2' తర్వాత అతిపెద్ద హిట్ చిత్రంగా నిలిచింది.
మహి వి రాఘవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ బయోగ్రాఫికల్ మూవీపై ముందు నుంచీ మంచి అంచనాలున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జీవితం ఆధారంగా రూపొందడం, చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో మమ్ముట్టి నటించిన చిత్రం కావడం, తీరకెక్కించిన విధానం, భావోద్వేగాలు పండించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తొలి వారంలోనే
ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం ‘ఎన్టీఆర్-కథానాయకుడు' విడుదలైన తర్వాత సరిగ్గా నెల రోజులకు ‘యాత్ర' ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ‘ఎన్టీఆర్ బయోపిక్' బాక్సాఫీసు వద్ద ఫెయిల్ అవ్వడంతో ‘యాత్ర'పై చాలా మందిలో సందేహాలు మొదలయ్యాయి. అయితే అందుకు భిన్నంగా ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ సాధించడంతో పాటు తొలివారంలోనే డిస్ట్రిబ్యూటర్లకు 80 శాతం పెట్టుబడి రికవరీ చేసింది.

2 వారాల కలెక్షన్
రెండో వారంలోకి ఎంటరైన తర్వాత దేవ్, లవర్స్ డే లాంటి చిత్రాల పోటీ ఏర్పడ్డప్పటికీ ‘యాత్ర' మంచి వసూళ్లు సాధించింది. 14 రోజులు పూర్తయ్యే సమయానికి ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 28.75 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

లాభాల్లో డిస్ట్రిబ్యూటర్లు
‘యాత్ర' మూవీ థియేట్రికల్ రైట్స్ రూ. 13.40 కోట్లకు అమ్మారు. రెండు వారాల్లో రూ. 15.95 కోట్ల వసూలైంది. దీంతో ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాట పట్టారు. 2019లో ఎఫ్ 2 తర్వాత నిర్మాతలకు లాభాలు తెచ్చిన తెలుగు సినిమా ఇదే.

2019 సెకండ్ హిట్
మూడో వారంలో ఎన్టీఆర్-మహానాయకుడు, మిఠాయి, 4 లెటర్స్, అంజలి సిబిఐ లాంటి చిత్రాలు విడుదలయ్యాయి. అయితే ఇవేవీ బాక్సాఫీసు వద్ద సక్సెస్ టాక్ తెచ్చుకోలేదు. ఇది కూడా ‘యాత్ర'కు కలిసొచ్చే అంశమే. సినిమా విజయం సాధించడంపై దర్శక నిర్మాతలతో పాటు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











