twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ X వైఎస్ఆర్.. రికార్డ్ బీట్ చేయడంలో ఫెయిల్!

    |

    వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టడానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందిన చిత్రం 'యాత్ర'. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ఏలో గ్రాండ్‌గా రిలీజైంది.

    తెలుగు సినిమాలకు కీలక మార్కెట్‌గా ఉన్న యూఎస్ఏలో 'యాత్ర' ప్రీమియర్ షో కలెక్షన్స్ వివరాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ మూవీ ఎన్టీఆర్ బయోపిక్ రికార్డును బద్దలు కొట్టడంలో విఫలమైంది. వసూళ్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

    ‘యాత్ర’ యూఎస్ఏ ప్రీమియర్ షో కలెక్షన్స్

    ‘యాత్ర’ యూఎస్ఏ ప్రీమియర్ షో కలెక్షన్స్

    ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ‘యాత్ర' మూవీ యూఎస్ఏలో 114 లొకేషన్లలో విడుదలైంది. యూఎస్ఏ కాలమానం ప్రకారం ఫిబ్రవరి 7 రాత్రి 8.40 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం అన్ని లొకేషన్ల నుంచి $55,462 వసూలైనట్లు తెలుస్తోంది. అయితే ఈ నెంబర్ ఎన్టీఆర్ బయోపిక్ వసూలు చేసిన దాంతో పోలిస్తే చాలా తక్కువే.

    ఎన్టీఆర్ బయోపిక్ కలెక్షన్స్

    ఎన్టీఆర్ బయోపిక్ కలెక్షన్స్

    సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘ఎన్టీఆర్-కథానాయుడు' $476,384 వసూలు చేసింది. ఓవరాల్ వసూళ్లు కూడా దాదాపు 1 మిలియన్‌కు చేరువైంది. అయితే ఫస్ట్ వీకెండ్ తర్వాత ఈ చిత్రం సైతం అక్కడ ఆదరణ కోల్పోయిన సంగతి తెలిసిందే.

    ‘యాత్ర’ ఫస్ట్ వీకెండ్ తర్వాతే...

    ‘యాత్ర’ ఫస్ట్ వీకెండ్ తర్వాతే...

    ‘యాత్ర' చిత్రానికి యూఎస్ఏలో ఆదరణ ఎలా ఉంటుందనే విషయం ఫస్ట్ వీకెండ్ తర్వాత కానీ చెప్పలేం. అక్కడ పరిస్థితి పుంజు కుటుందా? లేదా? అనే విషయాన్ని బట్టి సినిమా రిజల్టుపై ఓ నిర్ణయానికి రావడానికి వీలుంటుంది.

    యాత్ర

    యాత్ర

    డాక్ట‌ర్ వై.య‌స్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర‌లోని ముఖ్య ఘ‌ట్టాల‌తో రూపొందిన చిత్రం ‘యాత్ర‌'. మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో నటించారు. మ‌హి వి రాఘ‌వ్ దర్శకత్వం వహించగా విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బేనర్లో నిర్మించారు.

    English summary
    According to the traders report, Yatra has collected $55,462 from 114 locations at the US box office in the premiere shows and this number is likely to go when the final figures will be released by its makers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X